టాలీవుడ్, కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్.  తాజాగా విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ మూవీకి  సంబంధించి టీజర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యాక్షన్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్. 

ఇక టీజర్ విషయానికి వస్తే..పూర్తి యాక్షన్ మూవీలా కనిపిస్తుంది. తమన్నా, విశాల్ మరోసారి ఈ  మూవీలో జంటగా నటిస్తున్నారు.  దాదాపు నిమిషం నిడివి ఉన్న టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్‌ సీక్వెన్సులు ఈ టీజర్‌లో కనిపిస్తాయి. ఇక మిల్కీబ్యూటీ గ్రీన్ బికినీలో పిచ్చేక్కించేలా ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు ఎన్నడూ ఆరబోయని అందాలు ఆరబోసినట్లు కనిపిస్తుంది. సాధారణంగానే తన గ్లామర్ తో మతి పోగొట్టే తమన్నా బికినిలో కనిపిస్తే కుర్రకారు ఫిదా కావడం ఖాయం అనిపిస్తుంది.

టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో అంతే అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్‌ తమిళ అందించిన సంగీతం టీజర్‌ను ఎంతో ఎలివేట్‌ చేసేదిగా ఉంది.  ఒకదశలో నిర్మాత ఆర్‌.రవీంద్రన్‌ సినిమాను ఎంతో రిచ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘అయోగ్య’ తర్వాత విశాల్‌ నటిస్తున్న సినిమా ఇది. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కు తమిళ రీమక్‌గా రూపొందిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. 

విశాల్‌ అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ అని చెప్పొచ్చు.ఈ మూవీకి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత: ఆర్‌.రవీంద్రన్‌, దర్శకత్వం: సుందర్‌ సి.


మరింత సమాచారం తెలుసుకోండి: