సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎంత టాప్ హీరోయిన్ అయినా కూడా ఒక ఏజ్ రాగానే పెళ్ళి చేసుకొని ఇల్లాలుగా సెటిల్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ తాప్సీకి మాత్రం పెళ్ళి ఇప్పుడే ఎందుకు. 'పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి..' గురించి ఆలోచిస్తే, చేసుకుంటే బావుంటుంది అంటోంది. అంటే పెళ్లి ప్రస్తావన గురించి ఇప్పుడప్పుడే తనతో మాట్లాడొద్దని తెగేసి చెబుతోంది. ఆల్రెడీ తను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టుగా.. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే కాదన్నట్టుగా తాప్సీ సమాధానం ఇస్తుంది. తన చెల్లెలు ద్వారా తనకు ఆ వ్యక్తి పరిచయం అయ్యాడని తాప్సీ క్లారిటీగా చెబుతోంది. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ప్రకటించింది.

32 ఏళ్ళ తాప్సీ గురించి గతంలో ఈ విషయంలోనే చాలా పుకార్లు వినిపించాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిస్తున్నప్పుడు కొందరు నటులతో తాప్సీ పేరు ముడిపెట్టి ప్రచారం చేశారు. ఒక తెలుగు హీరోతో, మరో తమిళ హీరోతో తాప్సీ ప్రేమ అంటూ వివిధ సందర్భాల్లో వార్తలు వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 
ఒకదశలో చెన్నైలో వారిద్దరూ కొట్టుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తాప్సీ విషయంలో వారి మధ్య గొడవ జరిగినట్టుగా ప్రచారం జరిగింది. అది కూడా ఒక పబ్ లో వారి మధ్యన గొడవ జరడంతో అది పెద్దది అయ్యిందట కూడా. ఆ తర్వాత తాప్సీ పబ్ లకు పూర్తిగా దూరం అయ్యింది. వచ్చిన అవకాశాలను చేసుకుంటు వరుసగా హిట్స్ పడటంతో బాలీవుడ్ లో బిజీ అయ్యింది.   

సౌత్ లో కొంతమంది తన కెరీర్ ను నాశనం చేశారు తప్ప ఆ సినిమాలు ఉపయోగపడలేదని వాపోయింది. ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలతో తాప్సీ బాగా బిజీగా ఉంది. అవి కూడా హిట్ అవుతూ ఉండటంతో తాప్సీ కెరీర్ మంచి స్థాయిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డేటింగ్ విషయాన్ని ప్రకటించింది. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి అని అంత వరకూ అతడితో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా.. అని తాప్సీ నిస్సంకోచంగా ప్రకటించింది. అంటే దీనికి అర్థం సహజీవనం బావుందనే కాదా..! 


మరింత సమాచారం తెలుసుకోండి: