నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా గ్యాంగ్ లీడర్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పెన్సిల్ పార్ధసారధిగా నాని మరోసారి అదరగొట్టాడని తెలుస్తుంది. విక్రం కె కుమార్ కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి.


అయితే ఈ సినిమా కథ గురించి ఆలోచిస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. చెప్పడానికి రివెంజ్ స్టోరీనే అయినా తమకు బాగా కావాల్సిన వాళ్లను పోగొట్టుకున్న ఐదుగురు ఆడవాళ్లు వాళ్లు ఏమి చేయలేక ఓ రివెంజ్ రైటర్ హెల్ప్ తీసుకుని ఆ విలన్ పని పడతారు. అయితే ఈ కథని ఓకే చెప్పినప్పుడే నాని సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.


స్టార్ ఇమేజ్ వచ్చాక ఎంతసేపు మ్యాక్సిమం స్క్రీన్ స్పేస్ తమదే ఉండాలి. సినిమాలో బలమైన సీన్స్, యాక్షన్ పార్ట్ అంతా తమదే అని చెప్పే స్టార్స్ ఉన్నారు. అయినా సరే కథను నమ్మి సినిమాలు తీసే నటులలో నాని ఒకడని చెప్పొచ్చు. సినిమాలో పెన్సిల్ పార్ధసారది పాత్రలో నాని అదరగొట్టేశాడు. తన మార్క్ కామెడీ, యాక్షన్ టైమింగ్ తో నాని మెప్పించాడు.


ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమా చూశాక ఇలాంటి కథను ఒప్పుకునే టాలీవుడ్ హీరో మరెవరు ఉండరని అంటున్నారు. పాత కథలనే సరికొత్త స్క్రీన్ ప్లేతో అందించే సినిమాలకే స్టార్స్ ఓకే చెబుతారు. కాని నాని మాత్రం సినిమా సినిమాకు కొత్తదనం ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ ఇయర్ జెర్సీ తో హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో మరో అదిరిపోయే హిట్ కొట్టాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: