తెలుగు లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్. స్వతహాగా డాక్టర్ అయిన రాజశేఖర్ తలంబ్రాలు, ఆహుతి లాంటి మూవీలో నెగిటీవ్ పాత్రల్లో నటించినా..అంకుశం లాంటి మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే తరహా పోలీస్ పాత్రల్లో కొంత కాలం నటించిన ఆయన తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించారు.
తలంబ్రాలు, ఆహుతి, అంకుశం సినిమాల్లో నటించిన తన సహటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ మద్య రాజశేఖర్ నటించిన సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ కావడంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల గరుడ వేగ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మద్య కల్కి సినిమాతో మరో విజయం అందుకున్నాడు. రాజశేఖర్, జీవిత ఆ మద్య జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’నూతన కార్యవర్గం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచిన విషయం తెలిసిందే.
ఈ మద్య ‘మా’ అసోసియేషన్ లో పెద్ద రగడ మొదలైన విషయం తెలిసిందే. ‘మా’ లో తన విధులు సరిగా నిర్వహించడం లేదని అధ్యక్షుడు నరేష్ ని పదవి నుంచి వైదొలగమని నోటీసులు కూడా పంపారు. ఇదిలా ఉంటే తాజాగా ‘మా’కు డా.రాజశేఖర్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని మా కమిటీ భావించింది. ఈ క్రమంలో మా యూనియన్‌కు అండగా ఉండేదుకు హీరో రాజశేఖర్ ముందుకొచ్చారు.
చిత్ర పరిశ్రమలోని అందరి సహకారంతో కొన్ని ఈవెంట్లు నిర్వహించి నిధులను సమకూరుస్తామని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్ విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మా కోసం తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇంతవరకూ 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నది. డా. రాజశేఖర్ 'మా'కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.