బిగ్ బాస్ సీజన్ 3 నుండి 8వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో ఆమె జర్నీ కేవలం రెండు వారాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ బదులుగా శిల్పా నామినేషన్స్ కండక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె వైల్డ్ కార్డ్ గా బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇచ్చింది.


అయితే లాస్ట్ వీక్ ఆమె తనని హౌజ్ మెట్స్ అందరు ఒంటరిదాన్ని చేశారని ఏకంగా నాగార్జున ముందే చెప్పేయడంతో ఆమెను ఈ వీక్ అందరు నామినేట్ చేశారు. అయితే బయట ఆడియెన్స్ లో కూడా శిల్పా చక్రవర్తి వల్ల అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శిల్పాను ఎలిమినేట్ చేశారు. 


శిల్పా ఎలిమినేషన్ అవడం పట్ల ఇంటి సభ్యులు పెద్దగా ఫీల్ అవలేదు. 8 వారాలుగా ఆదివారం ఎలిమినేషన్ జరిగిన ప్రతిసారి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు బయటకు వస్తుంటే మిగిలిన హౌజ్ మెట్స్ అంతా చాలా ఎమోషనల్ గా కనిపించారు. కాని శిల్పా బయటకు వచ్చే టైం లో మాత్రం ఎవరు పెద్దగా ఫీల్ అయినట్టు కనిపించలేదు. 


ఇక ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. మొదటి సీజన్ లో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా అతను చివరి వరకు ఉన్నాడు. ఇక సెకండ్ సీజన్ లో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఆమె కూడా కొన్నాళ్లు హౌజ్ మెట్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే సీజన్ 3లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇద్దరు త్వరగానే హౌజ్ నుండి బయటకు వచ్చేశారు. 


బిగ్ బాస్ సీజన్ 3లో మొదట్లో మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా సింహాద్రి రాగా.. ఆమె రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యింది. ఇక లాస్ట్ వీక్ వచ్చిన శిల్పా చక్రవర్తి కూడా రెండు వారాలకే హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం 10 మంది ఉన్న ఇంటి సభ్యులలో ఎవరు నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉంటారో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: