నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విక్రం కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హలో సినిమా తర్వాత విక్రం కుమార్ తో సినిమా చేసేందుకు స్టార్స్ వెనుకడుగు వేశారు. వారిలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండటం విశేషం.


ఎన్.టి.ఆర్ తో కథా చర్చలు జరిపిన విక్రం కుమార్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక బన్ని నా పేరు సూర్య తర్వాత విక్రం కె కుమార్ తోనే సినిమా ఫైనల్ అన్నారు. కాని ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కేసింది. అయితే ఇక్కడ సర్ ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎన్.టి.ఆర్ చేయన్నది.. బన్ని స్కిప్ చేసింది గ్యాంగ్ లీడర్ స్టోరీనే అని ఫిల్మ్ నగర్ టాక్.


నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమానే తారక్ హీరోగా కథ చెప్పాడట విక్రం. ఆయన చేయనఏసరికి అదే కథతో బన్ని స్టైల్ లోకి మార్చి చెప్పాడట. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పాడట అల్లు అర్జున్. అంతేకాదు స్టార్ ఇమేజ్ ఉండటం వల్ల ఇలాంటి సినిమా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్ తోనే తారక్, బన్ని ఇద్దరు గ్యాంగ్ లీడర్ మిస్ చేసుకున్నారు.


అయితే నాని మాత్రం ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. గ్యాంగ్ లీడర్ మొదటిరోజు టాక్ బాగా లేకున్నా తర్వాత సెట్ రైట్ అయ్యింది. సినిమా కలక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. నాని ఖాతాలో మరో హిట్ సినిమాగా గ్యాంగ్ లీడర్ నిలిచింది. సినిమాలో విలన్ గా హీరో కార్తికేయ నటించాడు. సినిమాలో అతను నటించిన దేవ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: