యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యనే సాహో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుజిత్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేదు. ఇదిలాఉంటే సాహో ప్రమోషన్స్ లో కాజల్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడాడు ప్రభాస్.


కాజల్ డ్రెస్సింగ్ అప్పట్లో పర్వాలేదు అనిపించేది కాని ప్రస్తుతం చాలా బాగుందని చెప్పాడు ప్రభాస్. తనకు ఇష్టమైన హీరోయిన్స్ లో కాజల్ ఒకరని అన్నాడు. ప్రభాస్, కాజల్ ఇద్దరు కలిసి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో నటించారు. కాజల్ పై ప్రభాస్ చేసిన కామెంట్స్ కు ఆమె రిప్లై ఇచ్చింది.


రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది కాజల్. ప్రభాస్ గురించి ఒక్కమాటలో చెప్పమంటే అని ఇంటర్వ్యూయర్ అడుగగా ఐరన్ మ్యాన్, హల్క్ కలిసి ఒకరైతే అది ప్రభాస్ అన్నది కాజల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. 


ప్రభాస్ తో నటించిన ప్రతి హీరోయిన్ కు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అదిగాక అతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడాను. కాజల్ చెప్పినట్టుగా ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరు కలిస్తే ప్రభాస్ అనడంలో తప్ప్లేమి లేదు. ఇక సినిమాల విషయానికిస్తే ప్రభాస్ ప్రస్తుతం జాన్ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. కాజల్ రీసెంట్ గా రణరంగం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు. రణరంగం సినిమా కూడా ఆశించిన స్థాయిని అందుకోలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: