Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 5:55 am IST

Menu &Sections

Search

మెగా అభిమానులకు షాక్... వాయిదా పడిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్..!

మెగా అభిమానులకు షాక్... వాయిదా పడిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్..!
మెగా అభిమానులకు షాక్... వాయిదా పడిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో మెగా అభిమానులకు చిన్నపాటి షాక్ ఇచ్చింది చిత్ర బృందం. ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించాల్సిన రిలీజ్ ఈవెంట్ అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేయవలసి వచ్చింది. దీంతో ఈ ఈవెంట్ కోసం భారీ ఎత్తున సన్నద్ధమైన ఫాన్స్ కొద్దిగా నిరాశపడ్డారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.

సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నాడే చిత్రానికి సంబంధించిన అన్ని పాటలను విడుదల చేయనున్నారు. ఆ రోజే థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. ఎల్లుండిన జరగవలసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను 22వ తారీఖు కి మేకర్లు వాయిదా వేశారు. 18వ తేదీన వాతావరణం అనుకూలించకపోగా పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర బృందం ఈవెంట్ ను వెంటనే వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఘోరమైన గోదావరి బోటు ప్రమాదం జరిగిన వెంటనే ఈవెంట్ ఎందుకు జరపడం అన్న కారణాంగా కూడా వాయిదా వేశారు అన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్రం తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్ ,విజయ్ సేతుపతి, తమన్నా వంటి హేమాహేమీలతో జరిగిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు కన్నుల పండుగ కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Shock for mega Fans... Sye Raa pre-release got posponed
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓటు ఎవరికి వేసినా... పడేది మాత్రం ఆపార్టీకే!
బ్రేకింగ్: బండ్ల గణేష్ అరెస్టు... ఇంత పెద్ద మోసగాడా...?
"చంద్రబాబు... కొంచెం నోరు అదుపులో పెట్టుకో"
ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించిన అమల ను మించి పోతానంటున్న కంగన..!
ఏపీలో హుజూర్ నగర్ తరహాలో రానున్న ఉప ఎన్నిక? ఏ నియోజకవర్గం అంటే....
ఉన్న ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకొనున్న జనసేన..?
ఆన్ లైన్ ఫుడ్ ద్వారా ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి!
జియో రీచార్జి కొత్త ప్లాన్లు ఇవే..! గతంలో కన్నా తక్కువే
సొంత భర్తే మంత్రగాళ్ళతో రేప్ చేయించి... రికార్డు చేసి... హైదరాబాదులో అమానుషం!
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...
హైకోర్టుకే ట్విస్టు ఇస్తున్న కెసిఆర్..? ప్రతిపక్షాలు భయపడుతున్నాయి మరి!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.