సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ దశాబ్ధ కాలంపైగా కెరియర్ కొనసాగిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన కాజల్ ఈమధ్య బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. అందాల భామ చందమామ కాజల్ అగర్వాల్ బ్యూటీకి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు. అయితే మేకప్ వేసుకుంటేనే ఈ అందమని కొందరు అంటారు.      


కాని మేకప్ ఉన్నా లేకున్నా అందం అందమే.. రీసెంట్ గా కాజల్ మేకప్ లేకుండా ఎయిర్ పోర్ట్ లో దిగిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. పింక్ కలర్ డ్రెస్ తో క్లాసీ గాగుల్స్ పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది కాజల్. చూస్తుంటే ఆమె మేకప్ లేకుండా ఉన్నట్టు తెలుస్తుంది. మేకప్ లేకున్నా సరే చందమామలా మెరిసిపోతుంది కాజల్ అగర్వాల్.   


ఆ చందమామలో అయినా మచ్చ ఉంటుందేమో కాని ఈ వెండితెర చందమామ అయిన కాజల్ లో వేలు పెట్టడానికి ఏమి లేదని చెప్పొచ్చు. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే పాట ఎవరికో రాశారు కాని ఆ పాట రాయాల్సింది కాజల్ కే అనేలా ఉంది ఆమె లుక్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హింది సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా చెక్కర్లు కొడుతుంది.


ఈ సందర్భంలోనే ఎయిర్ పోర్ట్ లో దిగిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా శర్వానంద్ హీరోగా వచ్చిన రణరంగం సినిమాలో నటించిన కాజల్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తెలుగులో కన్నా తమిళ హింది భాషల్లో క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. రాబోయే ఆ సినిమాలతో కాజల్ మళ్లీ సూపర్ ఫాం లోకి రావాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: