డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అమితంగా ఆకట్టుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ ఎంతటి హిస్టరీని క్రియోట్ చేసిందో అంతటి క్రేజ్ ను, హిస్టరీని గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ క్రియోట్ చేశాడు. ఇక మరో సారి మెగా హీరో ఈ వారం వాల్మీకి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రీమేక్ సినిమాలు సేఫ్ అని కొందరు హీరోలు, నిర్మాతలు అనుకుంటారు. ప్రేక్షకుల్లో కొంతమందికి రీమేక్ లంటే చులకన అభిప్రాయం ఉంటుంది.  ఆ.. అదేం గొప్ప కాదు. వేరే భాషలో హిట్ అయిన సినిమానే కదా అని చిన్నచూపు చూస్తారు.  అయితే రీమేక్ సినిమాను ఒరిజినల్ కంటే బెటర్ గా తీర్చిదిద్దడంలో.. తనదైన శైలిలో దానికి తెలుగు నేటివిటీ టచ్ ఇవ్వడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ స్పెషలిస్ట్. 

ఆ విషయం పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన 'గబ్బర్ సింగ్' తోనే ప్రూవ్ అయింది.  ఇప్పుడు 'వాల్మీకి' ప్రోమోస్ చూస్తుంటే అలాంటి ఫీట్ రిపీట్ చేశాడనే అంచనాలు వెలువడుతున్నాయి. నిన్న జరిగిన 'వాల్మీకి'  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మాజి ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్పీచ్ ఇచ్చేందుకు బ్రహ్మాజీ స్టేజ్ మీదకు రావడంతోనే అరుపులు కేకలు మొదలయ్యాయి. సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తనకు హరీష్ శంకర్ ఓ విచిత్రమైన క్యారెక్టర్ ఇచ్చాడని..గ్యాంగ్ స్టర్స్ కు యాక్టింగ్ నేర్పించే టీచర్ పాత్రలో నటించానని తెలిపాడు.

"ఈ సినిమా కథ మాత్రం హరీష్ శంకర్ తమిళం నుంచి తీసుకున్నాడు. కానీ చాలా మార్పులు చేర్పులు చేసి ఎంటర్ టైన్ మెంట్ జోడించాడు. జనరల్ గా ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలో తీస్తే దాన్ని రీమేక్ అంటారు. కానీ హరీష్ దాన్ని న్యూ మేక్ చేస్తాడు. ఒరిజినల్ ప్రొడ్యూసర్లే వచ్చి హరీష్ శంకర్ సినిమాను కొనుక్కునే పరిస్థితిని తీసుకొస్తాడు" అంటూ హరీష్ రీమేక్ లను డైరెక్ట్ చేసేవిధానం గురించి కొత్తగా చెప్పాడు. నిజంగా ఆలోచిస్తే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే అందరు డైరెక్టర్స్ లా రీమేక్ చేయకుండా ఒక కొత్త తరహాలో సినిమాని తయారు చేస్తాడు హరీష్. 



మరింత సమాచారం తెలుసుకోండి: