పూజా హెగ్డే 'ముకుంద' సినిమాతో పరిచయమవడమే కాదు ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా నటించింది. స్క్రీన్ మీద బావున్నారనే టాక్ తెచ్చుకున్నారు. సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికి పూజా-వరుణ్ కాంబినేషన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు మరోసారి ఈ జంట కలిసి నటించింది. దీనికి తోడు పూజా హెగ్డే డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పనిచేయడం కూడా ఇది రెండవసారి కావడం విశేషం. అయితే ఈ శుక్రవారం రానున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. వెంకటేష్ అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇదిలా ఉండగా ఇందులో పూజా హెగ్డే నటించడం పైకి ప్లస్సుగానే కనపడుతోంది కాని తన పాత్ర పరిధి సినిమా మొత్తం ఉండదు కాబట్టి ఈ విషయంలో ఎంత వరకు సంతృప్తి చెందుతారనే దాని మీద అనుమానాలు చాలానే ఉన్నాయి.

డిజేలో తనకు గుర్తింపు వచ్చే రోల్ ఇచ్చాడన్న అభిమానంతోనే పూజా హెగ్డే వాల్మీకి ఒప్పుకుందని అందులోనూ తక్కువ కాల్ షీట్స్ కాబట్టి పెద్దగా ఆలోచించలేదని ఇంతకు ముందే ఒక వార్త వచ్చి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే తాను ఉంటుందన్న న్యూస్ ఇంకొన్ని సందేహాలను జనాలలో క్రియోట్ చేసింది. పూజా హెగ్డేని మినహాయించి చూస్తే కథ ప్రకారం వర్తమానంలో వచ్చే ఊర మాస్ గణేష్ పాత్రకు జోడి ఉండదు. 

అధర్వాకు జంటగా మృణాళిని ఉంటుంది కాని వరుణ్ తేజ్ రోల్ మాత్రం సోలోగానే నడుస్తుంది. మరి అలాంటప్పుడు హీరోయిన్ లేకుండా అంత లెంత్ లో దర్శకుడు హరీష్ శంకర్ గణేష్ ప్రెజెంట్ ట్రాక్ ని ఎలా నడిపాడు అనే సందేహం రావడం సహజం. వీటికి సమాధానం దొరకాలంటే మాత్రం 20వ తేదిన సినిమా చూసే వరకు ఆగాల్సిందే. మిక్కి జే మేయర్ సంగీతం మాస్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. కాని అసలు కంటెంట్ ఎంతవరకు మెగా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందో అన్న ఆసక్తి అందరిలోను కనపడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: