Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:19 pm IST

Menu &Sections

Search

ఈసారి నాని, బండ్ల గణేష్ కలిసి....

ఈసారి నాని, బండ్ల గణేష్ కలిసి....
ఈసారి నాని, బండ్ల గణేష్ కలిసి....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే బండ్ల గణేష్ అనూహ్యంగా పెద్ద నిర్మాతగా మారిన సంగతి మనకు తెలిసిందే. గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్ వంటి భారీ హిట్లు సాధించిన తర్వాత లావాదేవీల విషయంలో అనేకానేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కొద్ది రోజులు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న బండ్ల రాజకీయాల్లో కుడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరంగ్రేటం చేసిన ఈ బడా ప్రొడ్యూసర్... టికెట్ రాకపోయినా కాంగ్రెస్ విజయంపై అపారమైన నమ్మకం పెట్టుకొని.... శపథాలు చేసి '7'0 క్లాక్ బ్లేడ్ స్టార్' గా కూడా బాగా ప్రసిద్ధి చెందాడు.

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ కు రీ-ఎంట్రీ ఇస్తున్న బండ్ల గణేష్ నిర్మాతగా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడట. తన ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన పనులన్నీ వేగవంతం చేశారని సమాచారం. నేచురల్ స్టార్ నాని తో బండ్ల గణేష్ ఒక సినిమా చేయబోతున్నాడని.... అయితే ఎప్పుడూ స్టార్ డైరెక్టర్ల వెంటపడి భారీ బడ్జెట్ సినిమాల పై కన్నేసే గణేష్ కొత్త డైరెక్టర్ తో మామూలు బడ్జెట్ లో సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే కథకు సంబంధించిన అన్ని డిస్కషన్లు అయిపోగా... త్వరలోనే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనుంది. తన శైలికి భిన్నంగా ఒక చిన్న బడ్జెట్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న గణేష్ కనుక క్లిక్ అయితే రానున్న రోజుల్లో బండ్లకి అది పెద్ద ప్లస్ అవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మంచి కామెడీ క్యారెక్టర్ చేస్తున్న బండ్ల గణేష్ నటుడిగా కొనసాగుతూనే ప్రొడక్షన్ పనులు చూసుకుంటాడా లేక పూర్తి స్థాయి ప్రొడ్యూసర్ గా మారుతాడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.


Nani and Bandla Ganesh to collaborate....
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.