విజయ్ దేవరకొండ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'బ్రేకప్' అని ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆ టైటిల్ లో చాలా నెగిటివ్ సౌండింగ్ వచ్చిందని నిర్మాతలు భావించి మరొక టైటిల్ ని లాక్ చేశారు. కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ను చిత్రబృందం బయట పెట్టడం జరిగింది.

'వరల్డ్ ఫేమస్ లవర్' అన్న టైటిల్ తో సినిమా చేయనున్న మన రౌడీ బాయ్ ఇందులో నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిస్సా మరియు హాలీవుడ్ బ్యూటీ ఇజబెల్లే విజయ్ సరసన నటించినున్నారు. పోస్టర్ పైన వీరి నలుగురు పేర్లు ప్రింట్ చేసి ఒక భారీ ప్రేమకథ ప్లాన్ చేసినట్లు తెలిపారు చిత్రబృందం. ఎప్పుడూ యాక్షన్ సినిమాలు పైన దృష్టి పెట్టే విజయ్, 'గీత గోవిందం' లాంటి ఫ్యామిలీ సినిమా చేసినా యాంగ్రీ యంగ్ మ్యాన్ గానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ కథ చిత్రం లో ఎలా రాణిస్తాడు అని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మధ్యకాలంలో మనసుని హత్తుకొనే రొమాంటిక్ బాణీలు సమకూరుస్తున్న గోపీసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా విజయ్ ఈ మధ్య ఎంచుకుంటున్న స్క్రిప్టులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో విజయ్ ప్లేబాయ్ గా కనిపిస్తాడా లేదా చాలాసార్లు ప్రేమని అన్ని పోగొట్టుకున్న సిన్సియర్ లవర్ గా కనిపించబోతున్నాడా అన్న విషయం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: