బిగ్ బాస్ హౌజ్ లో 9వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా టెలిఫోన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫోన్ ఎత్తిన వారు డైరెక్ట్ గా నామినేట్ అయితే.. వారి కోసం ఇంటి సభ్యులు బిగ్ బాస్ చెప్పిన దానికి ఓకే చెప్పాల్సి ఉంటుంది. అలా ఇంటి సభ్యులు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి సేఫ్ అవుతాడు. అలా చేయకుండా నామినేషన్ లో ఉంటారు.


నిన్న జరిగిన ఎపిసోడ్ లో శ్రీముఖి కోసం బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకోగా.. శివ జ్యోతి కోసం మహేష్ హెయి కు కలర్ వేసుకున్నాడు. ఇక పునర్నవి కోసం రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాడు. లాస్ట్ వీక్ నాగార్జున ముందే పునర్నవి రాహుల్ తో ఫ్రెండ్ షిప్ కు ది ఎండ్ కార్డ్ అని చెప్పింది.


అయితే ఈ టాస్క్ వల్ల మళ్లీ వారిద్దరి మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యింది. అంతేకాదు రాహుల్ తన కోసం రిస్క్ చేసిమరి కాకరకాయ జ్యూస్ తాగాడని సేఫ్ అని తెలియగానే రాహుల్ ను కౌగిలించుకుని కిస్సు పెట్టింది. బిగ్ బాస్ హౌజ్ లో ముద్దు ముచ్చట్లు కామనే.. ఇప్పటికే రాహుల్, పునర్నవిల మధ్య రిలేషన్ ఏంటని డౌట్ పడుతుండగా పున్ను ఏకంగా రాహుల్ కు కిస్ పెట్టడంతో వారి మధ్య రిలేషన్ పై చర్చలు దారి తీస్తుంది.


ఇక నామినేషన్ లో భాగంగా హిమజ కోసం వరుణ్ సందేష్ పేడ తొట్టిలో ఉండాల్సి ఉంది. ఆ టాస్క్ నచ్చకపోయినా అతి కష్టం మీద పూర్తి చేశాడు వరుణ్ సందేష్. దాని వల్ల ఆమె సేఫ్ అయ్యింది. ఇక వరుణ్ తేజ్ కోసం శ్రీముఖి తన చేతి మీద బిగ్ బాస్ టాటూ వేయించుకుని అతన్ని సేవ్ చేసింది. బాబా భాస్కర్ ను సేఫ్ చేసేందుకు రవి తన షూస్ అన్ని రంగులో ముచాడు. అయితే ఇంకా రవి కృష్ణ, శివ జ్యోతిలకు ఫోన్ రాలేదు. ఇప్పటివరకు నామినేషన్ లో మహేష్ ఒక్కడే ఉన్నాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేకుండా ఓటింగ్ ద్వారా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ ను వెనక్కి తెప్పిస్తారని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: