ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎన్నో బయోపిక్ మూవీస్ వస్తున్నాయి. సినీ, రాజకీయ ఇతర రంగాల్లో ప్రముఖుల జీవితాలకు సంబంధించి వస్తున్న బయోపిక్ లకు మంచి ఆదరణ కూడా లభిస్తుంది.  ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితచరిత్ర ఆధారంగా ఆ మధ్య 'పి.ఎమ్.నరేంద్ర మోదీ' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రధాని పాత్రలో నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. కాకపోతే ఈ మూవీ అనుకున్న స్థాయిలో పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.  ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కి మరో బయోపిక్ గా హిందీలో 'మన్ బైరాగి' మూవీ రూపొందుతోంది.   

సంజయ్ లీలా భన్సాలీ - మహావీర్ జైన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంజయ్ త్రిపాఠి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.  భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని బ‌యోపిక్ రూపొందుతున్న ‘మ‌న్ బైరాగి’ ఫస్ట్ లుక్ చాలా బాగుంది.   యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హిందీలో మ‌న్ బైరాగి అనే టైటిల్‌ ఖ‌రారు కాగా, తెలుగులో ‘మ‌నో విరాగి’ అనే పేరు ఫైనల్ చేశారు. సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వంలో ‘మ‌న్ బైరాగి’ బ‌యోపిక్‌ను సంజ‌య్ లీలా భ‌న్సాలి, మ‌హావీర్ జైన్ నిర్మిస్తున్నారు. 


అయితే ఈ మూవీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేశారు.  మ‌న్ బైరాగి హిందీ, తెలుగు వెర్ష‌న్ల పోస్ట‌ర్లను ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేస్తూ… ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిపై రూపొందుతోన్న ప్ర‌త్యేక‌మైన సినిమా ఇది, హ్యాపీ బ‌ర్త్ డే న‌రేంద్ర‌మోడీ గారు.. అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. ఇక మోదీ జీవితంలో ప్రపంచానికి తెలియని నిజాలని ఈ మూవీలో చూపించబోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: