ప్రస్తుతం యూత్ పల్స్ పట్టిన యువ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చితంగా విజయ్ దేవరకొండ అని కచ్చితంగా చెప్పొచ్చు. పెళ్లిచూపులు హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు అతనికి మరింత క్రేజ్ తెచ్చాయి. అయితే రీసెంట్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు.


అయినా సరే మరో క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో క్రాంతి మాధవ్ డైరక్షన్ లో విజయ్ నటిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజబెల్లే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా టైటిల్ తోనే మూవీపై అంచనాలు పెంచారు చిత్రయూనిట్.


విజయ్ మార్క్ క్రేజీ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో హిట్ అందుకున్న క్రాంతి మాధవ్ సునీల్ తో తీసిన ఉంగరాల రాంబాబు తర్వాత 3 ఏళ్లు ఈ సినిమా కోసం వర్క్ చేశాడు. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ తన సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.


కచ్చితంగా ఈ సినిమా విజయ్ కెరియర్ లో ది బెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలేమాత్రం ఫాం లో లేని క్రాంతి మాధవ్ తో విజయ్ సినిమా చేస్తున్నాడు అంటేనే సినిమా కథ చాలా గొప్పగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చెయొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్స్ నలుగురు కాబట్టి కచ్చితంగా ప్రేమలోని అన్ని కోణాలని చూపిస్తారని చెప్పొచ్చు. మొత్తానికి విజయ్ సినిమా టైటిల్ తోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారేలా చేశాడు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: