బిగ్ బాస్ లో నామినేషన్ లో ఈ సారి మొత్తం ముగ్గురు ఉన్నారు. మహేష్ తో పాటు, రాహుల్, హిమజలు నామినేషన్ లోకి వచ్చారు. కంటెస్టెంట్స్ అందరూ తమకి నచ్చిన వారిని సేవ్ చేయడానికి త్యాగాలు చేసి నామినేషన్ నుండి కాపాడారు. అయితే హిమజ ని సేవ్ చేయడానికి వరుణ్ పేడ తొట్టిలో పడుకున్నప్పటికీ కెప్టెన్ గా వితికా ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి హిమజని నామినేట్ చేసింది.


హిమజని నామినేట్ చేయడానికి గల కారణం చెప్తూ మహేష్ కి ఆమె సరిగా హెల్ప్ చేయకపోవడమేనని  అంటుంది. కానీ నిజం చెప్పాలంటే హిమజ అంటే వితికాకి అస్సలు ఇష్టం లేదు. మొదటి నుండి హిమజ మీద ఒకరకమైన కోపమే ఎక్కువ ప్రదర్శించింది. వితికాకి ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల హిమజని నామినేట్ చేసింది తప్పితే అంతకుమించి ఏమీ లేదు. కానీ హిమజని నామినేట్ చేసి వితికా తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది.


ఎందుకంటే గత కొన్ని రోజులుగా హిమజ నామినేషన్స్ లో ఉంటూ వస్తుంది. అయినా కూడా సేవ్ అవుతూ వస్తుంది. దీన్ని బట్టి ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు. వితికా కొంచెం లాజికల్ గా ఆలోచించి చాలా రోజులుగా నామినేట్ అవని వారిని నామినేట్ చేసుంటే బాగుండేది. చాలా రోజులుగా నామినేషన్స్ లో లేని వాళ్ళు ముఖ్యంగా రవి, శివజ్యోతి లను నామినేట్ చేసి ఉంటే బాగుండేది.


అదీ గాక శివజ్యోతిని నామినేట్ చేయాలని వరుణ్, వితికా, మహేష్ లు డిస్కస్ చేసుకుంటారు. అయినా ఆమెని నామినేట్ చేయకపోవడం ఆశ్చర్యకరం. శివజ్యోతి నామినేషన్ కి రాక చాలా రోజులు అవుతుంది అన్న కారణంగా నామినేట్ చేద్దామని డిసైడ్ అయినపుడు అవకాశం వచ్చినపుడు మాత్రం పక్కకి తప్పుకోవడం మాత్రం ఏంటో అర్థం కాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: