జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. హిట్టు ఫ్లాపు తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా జనాలతో కలవకుండా చాలా రిజర్వుడు గా ఉంటూ తన పని తాను చేసుకుపోతూ నలుగురికి ఉపయోగపడుతూ ఉండే పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా పుస్తకాలతో మరియు ప్రకృతితో గడుపుతాడు అని ఆయనకు దగ్గరగా ఉండే సన్నిహితులు అభిమానులు చెబుతుంటారు. అంతగా పవన్ కళ్యాణ్ కి పుస్తకాలంటే ప్రేమ. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ తనకి పచ్చదనం పై మరియు మొక్కల పై అడవులపై ప్రేమ పెంచింది ఈ పుస్తకమే అని ప్రతి ఒక్కరూ చదవాలి అంటూ పిలుపునిచ్చారు.


ఆ పుస్తకం పేరు 'వనవాసి'. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా నల్లమల అంశంపైనే ట్వీట్లు చేస్తూ ఎవేర్ నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, వనవాసి అనే అనువాద పుస్తకం గురించి పవన్ స్పందించారు. బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను చిన్నవయసులోనే ఉండగా మద్రాస్ బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొన్నానని వివరించారు.


ఒక్కసారి ఈ పుస్తకం చదివితే ఎవరైనా ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారని, అడవుల సంరక్షణ కోసం ముందుకు కదులుతారని నమ్మకం వ్యక్తం చేశారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని తన ట్వీట్ లో వెల్లడించారు. మరియు వనవాసి పుస్తకంతో పాటు జర్మన్ రచయిత పీటర్ వోలెబెన్ రచించిన ది సీక్రెట్ నెట్ వర్క్ ఆఫ్ నేచర్ పుస్తకాన్ని కూడా ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అనే అన్వేషణలో పడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: