మెగా  ప్రిన్స్ వరుణ్  తేజ్ నటిస్తున్న వాల్మీకి సినిమా వివాదాల్లో చిక్కుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న వాల్మీకి సినిమాలో  వరుణ్ తేజ్ కొత్త లుక్ తో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాని  వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా టైటిల్ వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ బోయ సంఘాలు టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేసాయి . వాల్మీకి చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్ల దగ్గర ఆందోళన చేస్తామని బోయ సంఘం వారు హెచ్చరించారు. కానీ చిత్రబృందం మాత్రం టైటిల్ ని మార్చకుండా సినిమాను అలాగే విడుదల చేయడానికి నిర్ణయించింది. కాక దీనిపై స్పందించిన కర్నూల్, అనంతపురం జిల్లాల  కలెక్టర్లు వాల్మీకి సినిమాను తమ జిల్లాల్లో  ఆడనివ్వం అంటూ   నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వాల్మీకి చిత్రబృందం చివరికి దిగి వచ్చింది. వాల్మీకి సినిమా టైటిల్ ను మార్చేందుకు సిద్ధమైంది. 

 

 

 సినిమా విడుదల కావడానికి కొన్ని గంటల ముందు టైటిల్ ని మార్చింది వాల్మీకి చిత్రం. ఇప్పటివరకు వాల్మీకిగా ఉన్న సినిమా టైటిల్ ను "గద్దల కొండ గణేష్" గా మార్చారు. కాగా  రేపు ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదలకి కొన్ని గంటల ముందు సినిమా టైటిల్ మార్చడంతో... దీని ప్రభావం సినిమాపై ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: