దువ్వాడ జగన్నాథం’తో అనుకున్న కమర్షియల్ సక్సస్ ను అందుకోలేకపోయాడు దర్శకుడు హరీష్ శంకర్. అప్పటి నుంచే మళ్ళీ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కొట్టాలని తెగ తాపత్రయపడ్డాడు. రెండు మూడు కథలను అనుకొని అవి వర్కౌట్ చేయలేకపోయాడు. అందుకే ఈసారి తమిళ కల్ట్ మూవీ 'జిగర్ తాండ' ఆధారంగా 'వాల్మీకి' సినిమాని తెరకెక్కించాడు. తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రకు వరుణ్ ను సెలెక్ట్ చేసుకుని.. ఆ పాత్రకు అద్భుతమైన మేకోవర్ తో తనదైన టచ్ ఇచ్చి సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చాడు. విడుదలకు కొన్ని గంటల ముందు 'గద్దలకొండ గణేష్'గా పేరు మార్చుకుని.. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ ని తెచ్చుకుంది. 

ముఖ్యంగా గద్దలకొండ గణేష్ గా వరుణ్ మ్యాజిక్ చేశాడు. ఇప్పటి వరకు మనం తెలుగులో చాలా వెరైటి కథలనే చూశాము. అయితే చాలా కొత్తగా అనిపించే కథ.. అందులో సూపర్బ్ అనిపించే విలన్ పాత్ర. తమిళంలో క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న 'జిగర్ తాండ' సినిమాకు ప్రధానమైన అంశాలు. ఒకరకంగా చెప్పాలంటే కథను మించి బాబీ సింహా చేసిన విలన్ క్యారెక్టర్ హైలైట్ అయి తమిళ సినిమాను నిలబెట్టింది. ఇక 'జిగర్ తాండ'ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నపుడు.. విలన్ పాత్ర కోసం బాబీ సింహా నే తీసుకోవాలని ఏ డైరెక్టర్ కైనా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రకు ఒక హీరోను ఎంచుకోవడం హరీష్ శంకర్ చేసిన సాహసం. అంతేకాదు. తమిళంతో పోలిస్తే తెలుగులో ఆ పాత్రను కంప్లీట్ గా మార్చేశాడు. గెటప్, హావభావాలు, నటన.. అన్నింట్లోనూ తన మార్క్ చూపించాడు.  

ఇదే సినిమాకి ప్రధానమైన ఆకర్శణ అయింది. ఇప్పటివరకు వరుణ్ చేయని పాత్ర కావడం తో ప్రేక్షకులు గణేష్ పాత్రకు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ లో వరుణ్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తని చెప్పాలి. తల్లితో ఉన్న సెంటిమెంట్ సీన్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులతో కన్నీళ్ళను తెప్పించాడు. సినిమా ప్రారంభం నుండి ఒక మూడ్ లో ఉన్న ప్రేక్షకులు ఊహించని ఈ సీన్ కంటతడి పెట్టేలా నటించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: