బిగ్ బాస్…తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే బిగ్ బాస్ -3 అరవై రోజులు దాటి పోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టంట్ వారివారి కుటుంబ సభ్యులను పిలిపించి చిచ్చుపెట్టాడు. హౌస్ లో ఉన్న కంటెస్టంట్ ను కలుసుకునే అవకాశంలో భాగంగా అందరి ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి ఆహ్వానించారు బిగ్ బాస్. అయితే కొందరిని బాధ పెట్టి, మరి కొందరిని సంతోష పెట్టాడు. ఇందులో భాగంగా తమ కుటుంబ  సభ్యులను కలువలేకపోయిన శివజ్యోతి, శ్రీముఖిలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ  సభ్యులను కలువలేకపోయినందుకు వారు ఎక్కెక్కి ఏడ్చారు.  

 

అసలు బిగ్ బాస్ వారి మధ్య చిచ్చు ఎందుకు పెట్టాడు

అయితే కుటుంబ సభ్యులు తాము తీసే బాక్సులో బిగ్‌బాస్‌ ఐ లోగో వస్తేనే వారి కంటెస్టెంట్లను కలుస్తారని బిగ్‌బాస్‌ ఓ ఆట ఆడించాడు. వితికా కోసం వచ్చిన రాజు, రవి కోసం వచ్చిన అతని మామయ్య, పునర్నవి కోసం వచ్చిన ఆమె సోదరుడు, హిమజకు మద్దతుగా వచ్చిన రోజా. శివజ్యోతి సోదరుడు ధన్‌రాజ్‌లకు మాత్రమే బిగ్‌బాస్‌ ఐ లోగో వచ్చింది. మిగతా వారందరికీ జోకర్‌ బొమ్మ రావడంతో నిరాశ చెందారు. వారి కంటెస్టంట్ ను కలుసుకునే అవకాశం కోల్పోయారు. అయితే అవకాశం కోల్పోయిన వారికి వెళ్లేముందు కంటెస్టెంట్లకు ఏదైన సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని తెలిపాడు బిగ్ బాస్. అయితే వారి కంటెస్టంట్ ను కలుసుకునే అవకాశం కోల్పోయిన వారు తమ సందేశం ఇవ్వడంతో వారి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.  

 

ఇక్కడి నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఇద్దరు మాత్రమే వెళ్తారంటూ తెలిపాడు. అందుకోసం.. ఇంటి సభ్యుల్లోని టాప్‌ టూ కంటెస్టెంట్ల ఎవరంటూ మీరే తేల్చుకోవాలని, అందుకు మీకు 30 నిమిషాల  సమయం ఇస్తున్నట్లు, అందుకోసం ఓ డిబెట్ పెట్టుకోవల్సి ఉంటుందని ప్రకటించాడు బిగ్ బాస్ . ఇంకేముంది వారి మధ్య చిచ్చు పెట్టేసినట్టైంది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూడటానికి వచ్చిన వారు పోట్లాడుకునేదాకా తీసుకువచ్చిడు బిగ్ బాస్ .తెచ్చేశాడు.

 

చివరకు వారి డిబెట్ వల్ల ఏటు తేల్చకపోవడంతో చివరకు వారి ఎదురుగా ఉన్న ఐదు బాక్సులను పెట్టి ఒకదాన్ని ఎంచుకోమని తెలిపాడు. ఎవరి దాంట్లో బిగ్‌బాస్‌ ఐ లోగో వస్తే వారికే తమ కంటెస్టెంట్లను కలిసే అవకాశాన్ని ఇస్తానని తెలిపాడు. దీంతో వితికా సోదరుడు రాజు, రవి మామయ్య శ్రీనివాస్‌కు ఆ లక్కీ చాన్స్‌ వచ్చింది. వీరిద్దరి కన్ఫెషన్‌ రూమ్‌లో తమ కంటెస్టెంట్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చాడు బిగ్ బాస్. ఇలా మొత్తం మీద వారి సభ్యులను కలుసుకునేందుకు వచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చిచ్చే పెట్టేశాడు బిగ్ బాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: