Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:00 am IST

Menu &Sections

Search

చిరు సినిమాకి కొరటాల తీసుకుంటున్న అతి పెద్ద రిస్క్ ఇదే..!

చిరు సినిమాకి కొరటాల తీసుకుంటున్న అతి పెద్ద రిస్క్ ఇదే..!
చిరు సినిమాకి కొరటాల తీసుకుంటున్న అతి పెద్ద రిస్క్ ఇదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'సైరా' చిత్రం తర్వాత  మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్  మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి పోనుంది. అక్టోబర్ మూడో వారంలో షూటింగ్ ఊపందుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు హిట్ తప్ప ఇంకొకటి తెలియని డైరెక్టర్లలో రాజమౌళి సరసన చేరిపోయిన కొరటాల మినిమమ్ గ్యారెంటీ సినిమా ఇస్తాడని చాలా మంచి పేరుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్న కొరటాల సాధారణంగా సామాజిక అంశాలపై చిత్రాలు తీస్తూ అందరినీ మెప్పిస్తుంటాడు.

ఇకపోతే కొరటాల చిత్రాల్లో ఉండే కథలకి బాణీలు చాలా ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాదాపు కొరటాల శివ తీసిన చిత్రాలన్నింటికీ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటి వరకూ అతను తప్ప ఇంకొకరితో పని చేయని కొరటాల మొట్టమొదటి సారి చిరంజీవి సినిమాకి పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాడు. ఇప్పటివరకు ఘనవిజయం సాధించిన కాంబో ని కాదని కొరటాల బాలీవుడ్ లొని అజయ్-అతుల్ డ్యూయో ని చిరు చిత్రం కోసం సంగీతం అందించేందుకు సిద్ధం చేసుకుంటున్నాడట. 

ఇప్పటికే సైరా సినిమా కి అమిత్ త్రివేది ఇలాంటి మంచి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ని పెట్టుకున్న చిరంజీవి మరోసారి మరోసారి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చే బాణీలకు స్టెప్పులు వేయనున్నాడు. అజయ్-అతుల్ ఇద్దరు కలిసి ఇప్పటివరకు అగ్నీపథ్, మరియు ఈ మధ్య రిలీజ్ అయిన ధడక, సూపర్-30 వంటి సినిమాలకి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. మరాఠి చిత్రాలన్నిటిలో 'సైరత్' లాంటి భారీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన వీరి పేరు మారుమోగిపోతూ ఉంటుంది. మొట్టమొదటిసారి తెలుగులో ఆరంగ్రేటం చేయనున్న వీరు మెగాస్టార్ కోసం ఎలా వాయిస్తారో వేచి చూడాలి మరి.


Koratala taking huge risk for Chiranjeevi movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దెబ్బ మీద దెబ్బ... ఎల్లో మీడియా అబ్బ..!
ఆర్టీసీ ఉద్యోగుల నుండి కేసీఆర్ కు మొదటి దెబ్బ... గట్టిగానే తగిలిందిలే..!
మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి... సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ వచ్చేస్తోంది మరి!
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...! మళ్లీ సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ విడుదల
మీది MI ఫోన్ యేనా..? అయితే మీ MI ప్రియులకు శుభవార్త..!
చిరంజీవి మరియు చరణ్ లను ఒకే స్క్రీన్ పై చూపించబోతున్న బన్నీ డైరెక్టర్..!
ఈ కామాంధుడు ఆఖరికి గోమాతను కూడా వదల్లేదుగా..! తెలంగాణలో ఘోరం!
హైదరాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది అరెస్ట్..! భాగ్యనగరం అంతా రెడ్ అలెర్ట్..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.