బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో ఆడియెన్స్ ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 3లో లాస్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేషన్స్ అని చెప్పిన నాగ్ రాహుల్, హిమజలను ఇంటి నుండి బయటకు పంపించాడు. అయితే అందులో రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చాడు. 


హౌజ్ లో పునర్నవితో రాహుల్ లవ్ షోకి మంచి మైలేజ్ తెస్తుంది. అందుకే బిగ్ బాస్ రాహుల్ ఎలిమినేషన్ అంటూ ఓ క్రేజీ గేమ్ ఆడాడు. రాహుల్ బయటకు రావడంతో పునర్నవి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. వరుణ్ సందేష్ కూడా చాలా అప్సెట్ అయ్యాడు. అయితే రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని మళ్లీ అతను హౌజ్ లోకి వస్తాడని ఎవరికి తెలియదు.   


ఇక సోమవారం ఎపిసోడ్ ప్రోమోలో ఏయ్ నవి అంటూ రాహుల్ అరవడం.. శ్రీముఖితో ఐయాం ది హేటర్ అని చెప్పడం.. ఫైనల్ గా గొడుగు పట్టుకుని రాహుల్ రీ ఎంట్రీ ఇవ్వడం చూపించారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ సీజన్ లో రాహుల్ హీరో ఇమేజ్ వచ్చేలా చేశాడు. రీ ఎంట్రీ స్టైల్ లో కూడా అదరగొట్టాడు రాహుల్.  


రావడమే పునర్నవిని హగ్ చేసుకోవడం జరిగింది. రాహుల్ ఎంట్రీ హౌజ్ లో ఉన్న మిగతా ఇంటి సభ్యులందరిని షాక్ అయ్యేలా చేసింది. రాహుల్ ఎంట్రీతో మళ్లీ హౌజ్ లో ఓ నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుండి ఓ లెక్క అనేలా రాహుల్ ఇదవరకు ఉన్న ఉత్సాహం కన్నా రెండింతలు ఎక్కువ జోష్ తో కనిపిస్తున్నాడు. మరి రాహుల్ ఎంట్రీ తర్వాత హౌజ్ లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: