ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంది బాహుబలి సినిమానే. ఆ తర్వాత సాహో గురించి మాట్లాడుకున్నారు. రిలీజ్ కు ముందువరకు బాహుబలితో ఆ సినిమాను పోల్చారు. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొడుతుందా లేదా అన్నీ ఇండస్ట్రీలలో పెద్ద చర్చ జరిగింది. కానీ సాహో వచ్చి వెల్లిపోయింది తప్ప గట్టిగా ఆ సినిమా గురించి ఒక నెల రోజులు కూడా మాట్లాడుకుంది లేదు. ఇప్పుడు సైరా వస్తోంది. ఈ సినిమాని కూడా బాహుబలితో పోలుస్తూ కథనాలు, విశ్లేషణలు వస్తున్నాయి. అలాంటి అంచనాల్ని తగ్గించడానికి చిరంజీవి చొరవ తీసుకుంటున్నారు. అంతేకాదు సైరా సినిమాను బాహుబలితో పోల్చవద్దని పరోక్షంగా విజ్ఞప్తి చేస్తున్నారు. సైరా సినిమాతో తనకు గౌరవం మాత్రం దక్కితే చాలంటు తన అభిప్రాయాన్ని బయటికి చెప్పారు చిరంజీవి. ఓ శంకరాభరణం, ఓ బాహుబలి సినిమాలా తన సైరా సినిమా కూడా టాలీవుడ్ కు గౌరవం తీసుకొస్తే చాలంటున్నారు. 

కేవలం బాహుబలి విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే సైరా తీశామని, లేకపోతే సైరా సినిమా వచ్చేది కాదని సభా ముఖంగా ఒప్పుకొని అందరిని ఆశ్చర్య పరచారు."చాలా తక్కువ సినిమాలు ఇండస్ట్రీకి గౌరవం తీసుకొచ్చాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిశ్రమకు అలాంటి గౌరవం తీసుకొచ్చిన సినిమా శంకరాభరణం. నేను ఎక్కడికి వెళ్లినా అంతా శంకరాభరణం తీసిన ఇండస్ట్రీ అని చెప్పుకునేవాళ్లు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన సినిమా బాహుబలి. మనమందరం కాలర్ ఎగరేసి చెప్పుకునేంత గౌరవం తీసుకొచ్చింది. సైరా సినిమా కూడా అంత గౌరవాన్ని తీసుకొస్తుందనే నమ్మకం ఉందన్నారు".

అంతేకాదు కేవలం చరిత్రలో కనుమరుగైపోయిన ఓ వ్యక్తిని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే సైరాను తీశామని, పైగా ఆ వ్యక్తి మన తెలుగువాడు కావడంతో సైరా చేయాలని తపన పడ్డానని...అంతేతప్ప రికార్డుల కోసం సైరా సినిమా చేయలేదని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా నా మనసులో మెదులుతున్న సినిమా ఇది. స్వాతంత్ర్య సమరయోధుని పాత్ర చేయాలని ఉందంటూ 20 ఏళ్లుగా చెప్పుకుంటూ వచ్చేవాడ్ని. అయితే భగత్ సింగ్ పాత్ర చేసే అవకాశం నాకు రాలేదు. కానీ ఆ తర్వాత 12 ఏళ్ల కిందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర నా దగ్గరకు వచ్చింది. మనకు మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి తెలుసు. కానీ అదే టైమ్ లో వచ్చిన నరసింహారెడ్డి గురించి తెలియదు. అందుకే మేం తెలియజెప్పాలనుకున్నాం సైరా చేశాం అంటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: