అదేంటి మనిషిని చూసి ఆ మాత్రం గుర్తుపట్టలేమా అని టైటిల్ చూసి ఓ నిర్ణయానికి వచ్చేయొచ్చు. కాని చూసి ఒక నిమిషంలో చెబితే గ్రేట్ అన్నట్టే లెక్క. ఎందుకు ఈ హంగామా అంతా ఏంటి అసలు మ్యాటర్ అనుకుంటున్నారు కదా. పైన ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు మీకు తెలుసా.. సినిమా నాలెడ్జ్ బాగా ఉన్న వారికి పెద్ద కష్టమేమి కాదు.. రెగ్యులర్ గా సినిమాలు చూసే వారు కూడా ఒక నిమిషం ఆలోచించి చెప్పేలా ఉన్నాడు ఇతను.    


ఇంతకీ పైన ఫోటోలో వ్యక్తి ఎవరన్నది ఓ నిర్ణయానికి వచ్చారా.. ఆయన ఎవరో కాదు మన మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్.. దర్శకుడిగా సూపర్ హిట్లు అందుకున్న వినాయక్ ఈమధ్య సినిమాలు డైరెక్ట్ చేయడం మానేసి తెర ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే హీరో అవ్వాలనుకుంటున్నాడన్నమాట.       


అక్టోబర్ 9న వినాయక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అయితే ఈలోగా తన లుక్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డాడు వినాయక్. అందుకే ఈమధ్య రెండు మూడు ఈవెంట్స్ లో కొత్తగా విగ్ పెట్టుకుని.. గాగుల్స్ తో కనిపిస్తున్నాడు. కొత్తగా హీరో ఇమేజ్ కోసం ప్రాకులాడుతున్న వినాయక్ తన పర్సనాలిటీలో పెద్దగా మార్పులు తీసుకు రాలేదు కాని స్టైల్ మార్చాడని చెప్పొచ్చు.   


డైరక్టర్ గా గ్యాప్ ఇచ్చాడో లేక అది మానేసి హీరోగానే కొనసాగుదాం అనుకున్నాడో ఏమో కాని వినాయక్ హీరోగా మొదటి సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట. రీసెంట్ గా జరిగిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వినాయక్ విగ్ తో వచ్చాడు. మరి హీరోగా తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో మంచి ప్రయత్నాలు చేస్తున్న వినాయక్ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం వినాయక్ హీరోగా చేస్తున్న సినిమాలో ఆయన రైతుగా కనిపిస్తారని టాక్.     



మరింత సమాచారం తెలుసుకోండి: