ఈబిగ్ బాస్ సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. దాదాపుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనిపించుకున్న వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. బిగ్ బాస్ లో స్నేహం ఎప్పడికీ ఒకేలా ఉండదు అనడానికి బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య జరిగిన సంఘటనలని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. హౌస్ లో ఎప్పటి నుండో బాబా భాస్కర్, శ్రీముఖి స్నేహంగా ఉంటున్నారు. వాళ్ళ స్నేహానికి ఇప్పటి వరకు ఎలాంటి బ్రేక్ రాలేదు. అయితే నామినేషన్స్ టైంలో బాబా భాస్కర్ శివజ్యోతిని సేవ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.


శ్రీముఖి అభిమానులే కాదు బాబా అభిమానులు కూడా షాక్ తిన్నారు. అయితే అందుకు గల కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హౌస్ మెంబర్ వరుణ్ బాబా భాస్కర్ ని అడుగుతాడు. అయితే బాబా, శ్రీముఖి మాట్లాడిన విధానం హార్ష్ గా కనబడిందని, శివజ్యోతి వాదన కరెక్ట్ గా చేసిందని  అందుకే శివజ్యోతిని సేవ్ చేశానని చెప్పాడు. ఇంతకుముందు నామినేషన్ టైంలో కూడా శ్రీముఖిని సేవ్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆమెను సేవ్ చేయలేదు.


అప్పుడు ఏవో మాటలు చెప్పి కవర్ చేసాడు. అప్పుడు శ్రీముఖి సీరియస్ గా తీసుకోలేదు. ఈ సారి మాత్రం సీరియస్ గా తీసుకుంది. శ్రీముఖిని సేవ్ చేయకపోవడానికి గల కారణాలని ఆమెతో చెప్పాలని ప్రయతించాడు. కానీ శ్రీముఖి "ఈ ఇంట్లో నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు" అన్న విషయం క్లియర్ గా అర్థమైంది. నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అని నేను అడగను. కారణాలు నాకు అనవసరం. మీరు వివరించాల్సిన అవసరం కూడా లేదు అంటుంది.


శ్రీముఖి అలా అనేసరికి బాబా భాస్కర్ మొహం వాడిపోయింది. అది ఆయన కళ్ళలో స్పష్టంగా కనబడింది. శ్రీముఖి అలా అనగానే సరే అని వెళ్ళిపోయాడు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం ఇక్కడికే ఫుల్ స్టాప్ పడ్డట్టేనని తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, బాబా భాస్కర్ శ్రీముఖికి ఓటేసి ఆమెను సేవ్ చేసి ఉంటే గనక, శ్రీముఖి కూడా బాబా భాస్కర్ కే ఓటేసి ఉండేది. అపుడు బాబా నామినేషన్ లోకి వచ్చి ఉండేవాడే కాదు. దీని ప్రకారం బాబా భాస్కర్ శ్రీముఖిని నామినేట్ చేసి తప్పు చేశాడనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: