ఈ మద్య చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు సీన పరిశ్రమలో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.  ఈ సంవత్సరం దర్శక దిగ్గజాలు కోడీ రామకృష్ణ, విజయబాపినీడు కన్నుమూశారు. ఇలా పలువురు సినీ, టెక్నీషియన్స్ కన్నుమూసిన విషయం తెలిసిందే.  నటుడు, చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ మొన్నీమద్య కన్నుమూశారు.  తాజాగా ప్రముఖ నటుడు వేణు మాధవర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

గతంలో ఓ ఛానల్ వేణు మాధవ్ ఏకంగా మరణించారని వార్తలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. వేణు మాధవ్ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్. తండ్రి టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్ పనిచేసేవారు.  అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ పనిచేసింది. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు.అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. 

చిన్న తనం నుంచి నటనపై ఎంతో అభిరుచి పెంచుకున్న వేణు మాధవ్ మంచి ఆర్టిస్ట్ కావాలని మిమిక్రి నేర్చుకున్నారు..ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వేణు మాధవ్ హిమాయత్‌నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. అందులో పది కాల్స్ వస్తే తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి. క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలాకాదని, అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు. ఇలా సినీ పరిశ్రమవాళ్లతో పరిచయాలు పెంచుకున్న వేణు మాధవ ఇండస్ట్రీలోకి కాలుమోపాడు. వేణు మాధవ్ మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా .

తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, సై, ఛత్రపతి, మొదలైన సినిమాల్లో నటించాడు.  కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: