టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీలు ఎంతో మంది వచ్చినా..సక్సెస్ అయ్యింది మాత్రం కొద్దిమందే.  అలాంటి వారిలో స్నేహా ఉల్లాల్ ఒకరు.  సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఈమె అచ్చం ఐశ్వర్యరాయ్ లా ఉందని..లేదు ఆమె చెల్లలే అని కొంతరు అనేవారు.  మొత్తానికి ఐశ్వర్యరాయ్ బిల్డప్ తో ఈ హాట్ బ్యూటీ సినిమాల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంది.  ఎంత అందం ఆరబోసినా స్నేహా ఉల్లాల్ కి మాత్రం సినిమాలు పెద్దగా కలిసి రాలేదు...దాంతో  కొద్ది కాలంలోనే సినీ పరిశ్రమకు దూరమైంది. 

కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ  మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది.  అయితే హిట్లు లేకపోవడం ఈ అమ్మడికి నెగిటివ్ పాయింట్ గా మిగిలిపోయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు.. అటుపై టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన స్నేహ సరైన బ్రేక్ లేక అలాగే మిగిలిపోయింది. ఎప్పుడో దశాబ్దం కిందట సినీ పరిశ్రమకు పరిచయం అయిన స్నేహా ఉల్లాల్.  అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఈ అమ్మడు హల్ చల్ చేస్తుంది.

తాజాగా తన క్యూట్ లుక్స్ తో, హాట్ ఫిజిక్ తో స్నేహ అభిమానులను ఆనందపెడుతోంది. ఆ తర్వాత  బాలయ్య, మంచు మనోజ్, అల్లరి నరేశ్ వంటి హీరోల దగ్గరే ఆగిపోయింది. తరువాత అడపా..దడపా.. సినిమాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అస్సలు ఆఫర్లు లేవు  దీంతో హాట్ హాట్ ఫోటో ఘాట్లు చేసి దర్శకనిర్మాతల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరి స్నేహా ఉల్లాల్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ..సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: