పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే స్టార్ హీరో అయ్యే లక్షణాలున్న హీరో గోపిచంద్ హీరో నుండి విలన్ గా మారి ఆ తర్వాత మళ్లీ హీరోగా కెరియర్ నిలబెట్టుకున్నాడు. మాస్ ఆడియెన్స్ కు మస్త్ జబర్దస్త్ గా నచ్చే గోపిచంద్ సినిమాలు ఈమధ్య వాళ్ల అభిమానానికి దూరమయ్యాయి. ప్రతిసారి మాస్ మంత్రం పనిచేయదని గుర్తించిన గోపిచంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చాడు.


అయితే అవి కూడా రెగ్యులర్ గా అవడంతో ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు గోపిచంద్. లేటెస్ట్ గా చాణక్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గోపిచంద్.. తన తర్వాత సినిమా సంపత్ నంది డైరక్షన్ లో ఓకే చేశాడు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో గౌతం నంద సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.    


అటు సంపత్ నంది కూడా ఆ సినిమా తర్వాత సినిమాలు చేయలేదు. ఫైనల్ గా మళ్లీ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ అదే మాస్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ తో అదిరిపోయే మాస్ సినిమా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా మాస్ ఆడియెన్స్ మెచ్చేలా సీటీమార్ అని ఫిక్స్ చేశారట.   


రీసెంట్ గా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన్ గద్దలకొండ గణేష్ సినిమాలో సీటీమార్ సినిమా టైటిల్ ఉంటుంది. ఇదే హరీష్ శంకర్ బన్నితో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాలో కూడా సీటీమార్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ టైటిల్ తో మెగా ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ గోపిచంద్ వస్తున్నాడు. పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే గోపిచంద్ స్టామినా ఏంటో అందరికి ప్రూవ్ అవుతుంది. గౌతం నందతో మిస్సైన ఈ కాంబో సూపర్ హిట్ టార్గెట్ ఈసారి రీచ్ అవుతుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: