దశాబ్ధాలుగా సంతూర్ యాడ్ చూసిన వారికి ఒకటే గుర్తుకొస్తుంది.. అందులో అందమైన అమ్మాయిని చూసి కుర్రాళ్లు ఫీల్ అవడం.. ఆమెతో మాట్లాడే టైంలో మమ్మీ అనుకుంటూ వచ్చి ఓ పాప ఆమెను హత్తుకోవడం. కాన్సెప్ట్ మారినా దాదాపు సంతూర్ యాడ్ ఇదే కొనసాగిస్తుంది. మరో పదేళ్లు సంతూర్ యాడ్ ఇలానే ఉంటుంది కూడా.. ఇంతకీ ఇప్పుడు ఆ యాడ్ ఎందుకు ప్రస్థావించాల్సి వచ్చింది అంటే పెళ్లైతే హీరోయిన్ల పని కూడా అయిపోయినట్టు అని అనుకుంటే పొరబడినట్టే.   


ఒకప్పుడు ఆ పరిస్థితి ఉన్నా సంతూర్ మమ్మీలుగా ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా చెలరేగి పోతున్నారు హీరోయిన్స్. వీరికి అక్కినేని కోడలు సమంత ఓ స్పూర్తిగా నిలిచిందని చెప్పొచ్చు. రీసెంట్ గా సూర్య బందోబస్త్ లో నటించిన సయేషా సైగల్ కూడా సమంత బాటలోనే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుంది.


ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో తన పేరు చేర్చుకుంది ఆకాంక్ష సింగ్. సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీరావా సినిమాలో నటించి మెప్పించిన ఆకాంక్ష సింగ్ ఆ తర్వాత నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమాలో కూడా నటించింది. తెలుగులోనే కాదు కన్నడలో కూడా ఆకాంక్ష సింగ్ సినిమాలు చేస్తుంది. కిచ్చ సుదీప్ హీరోగా వచ్చిన పహిల్వాన్ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది.        


ఆ సినిమాలో అమ్మడు గ్లామర్ షోతో అదరగొట్టింది. పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోవడం ఏంటని ప్రశ్నిస్తే అందులో తప్పేముంది అంటుంది ఆకాంక్ష. పెళ్లికి ముందు ఎలా ఉన్నామో పెళ్లి తర్వాత కూడా అలానే ఉంటాం. సినిమాలో పాత్రకు తగినట్టు గా నటించడంలో తప్పేం లేదని చెబుతుంది అమ్మడు. దీనికి తన భర్త సపోర్ట్ కూడా ఉందని చెబుతుంది. పెళ్లైతే మాత్రం ఏంటి గ్లామర్ విషయంలో తగ్గేది లేదంటుంది ఆకాంక్ష. తెలుగులో ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది. చూస్తుంటే సమంత బాటలో ఆకాంక్ష కూడా పెళ్లి తర్వాత మంచి కెరియర్ కొనసాగించేలా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: