పోర్న్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ ఆ మూవీస్ ని ఆపేసి పూర్తిగా మారిపోయింది. పోర్న్ మూవీస్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాక జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో సన్నీ బాలీవుడ్ లో ఎరోటిక్ రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేసిన సన్నీ ప్రత్యేక గీతాలతోనూ భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లోను కరెంట్ తీగ, గరుడ వేగ సినిమాలలో నటించింది. ఇక తన జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేసిన సన్నీ ఈ సారి వాత్సాయన కామసూత్ర ఆధారంగా తెరపైకి రాబోతున్న వెబ్ సిరీస్ లో నటించబోతోందని లేటెస్ట్ న్యూస్.

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో పాటు స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్- సైఫ్ అలీఖాన్ వంటి స్టార్లు వెబ్ సిరీస్ లతో హోరెత్తిస్తుంటే వాత్సాయన కామసూత్రతో సన్నీ డిజిటల్ ప్రపంచాన్ని అల్లాడించబోతోంది. డిజిటల్ హవా సాగుతున్న ఈ ట్రెండ్ లో సన్నీ కామసూత్ర వెబ్ సిరీస్ తో షేక్ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్ లో హాటెస్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఏక్తా కపూర్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తుండటం విశేషం. ఇటీవలే వాత్సాయన కామసూత్ర స్క్రిప్ట్ విన్న సన్ని ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 13వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ ని బాలాజీ బ్యానర్ పై త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఏక్తాకపూర్ వాత్సాయన కాసూత్ర తో సన్నీ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. మొత్తనికి పోర్న్ స్టార్ గా ఒక వర్గం ప్రేక్షకులతో ఛి కొట్టించుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు నటిగా అందరి మన్నలను పొందడం నిజంగా అభినందించాల్సిన విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: