ప్రస్తుతం  బాలీవుడ్ కండల వీరుడు  సల్మాన్ ఖాన్   దబాంగ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రభు దేవా  దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా.  2009 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వాంటెడ్ సినిమాకి ప్రభు దేవా దర్శకత్వం వహించాడు. వాంటెడ్ సినిమా  సూపర్  స్టార్ మహేష్ దర్శకుడు పూరి జగన్నాథ్  కాంబోలో వచ్చి ఇండస్ట్రి హిట్ అయినా పోకిరి సినిమాకి  అఫిషియల్ రీమేక్.   వాంటెడ్ సినిమా సూపర్ డూపర్ హిట్  అయ్యింది.


వాంటెడ్ సినిమా తరువాత వరుసగా సౌత్ రీమేక్ సినిమాల్లో నటించి మంచి ఫామ్ లోకి వచ్చాడు . ఆ తరువాత ఆయన నటించిన దబాంగ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఆయన పోషించిన చుల్ బుల్ పాండ్ పాత్ర చాలా ఫేమస్ అయ్యింది   మొదటి రెండు భాగాలు  మంచి విజయం సాధించాయి.  ఇప్పుడు ఈ దబాంగ్  సీరిస్ లో మూడవ భాగం వస్తుంది..ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.


 అయితే    సల్మాన్ ఖాన్  నటిస్తున్న  " ఇన్షా అల్లా" సినిమాని  2020 ఈద్ కి విడుదల చేస్తామని చెప్పారు.కానీ  కొన్ని  కారణాల వల్ల "ఇన్షా అల్లా" ఆగిపోయింది.  2020 ఈద్  కి  కొత్త సినిమా రిలీజ్ చేస్తానని సల్మాన్ ఖాన్ ప్రకటించాడు. ఈ సినిమాకి  ప్రభు దేవా దర్శకత్వం వహించనున్నాడు.  దీంతో వీరి కాంబోలో వచ్చే మూడవ సినిమా సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాకి" రాధే" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. దబాంగ్ 3 సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది .  ఈ రెండు సినిమాలు హిట్ అయితే ప్రభు దేవా కు  మంచి క్రేజ్ రావడం ఖాయం .  


సౌత్ సినిమాలను సౌత్ దర్శకులను బాలీవుడ్  ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. . గత  కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఈద్ కి సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం  తెలిసిందే.  వచ్చే సంవత్సరం ఈద్  కి ఆయన సినిమా రావడం లేదు అనే సరికి ఆయన అభిమానులు చాలా నిరాశ చెందారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ వార్త విన్న ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: