ఓ భాషలో హిట్టైన సినిమా మరో భాషలో రీమేక్ అవడం సర్వసాధారణమే. అందుకే తెలుగులో హిట్టైన సినిమాలను హిందిలో రీమేక్ చేస్తున్నారు. అయితే యూనివర్సల్ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే అది కేవలం భారీ బడ్జెట్ సినిమాల వల్లే అవుతుంది.


ఇదిలాఉంటే బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజై సూపర్ హిట్టైన అంథాదున్ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా రీమేక్ హక్కులను నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి దక్కించుకున్నారు. నితిన్ హీరోగా ఆ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పర్ఫెక్ట్ డైరక్టర్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ అవలేదు.


రీసెంట్ గా సుధీర్ వర్మకు ఆ ఛాన్స్ వచ్చినట్టు చెప్పుకొచ్చినా.. స్వామిరారా తప్ప సుధీర్ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే అంథాదున్ రీమేక్ సుధీర్ వర్మ చేతుల్లో పెట్టేందుకు ఆలోచిస్తున్నారట. సుధీర్ వర్మ సినిమాల్లో కథ రొటీన్ గా ఉంటుంది కాని మేకింగ్ బాగుంటుంది. 


అందుకే సుధీర్ వర్మ మీద నమ్మకం పెట్టొచ్చని కొందరు అంటున్నారు. ఒక హిట్టు పడితే జీవితాలు తారుమారవుతాయి. అయితే కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ వర్మ రీసెంట్ గా వచ్చిన రణరంగం సినిమాతో హిట్ కొడతాడన్ని ఊహించారు కాని అది కుదరలేదు. అంథాదున్ రీమేక్ సుధీర్ వర్మ చేతుల్లో పడితే మాత్రం కచ్చితంగా సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ సుధీర్ వర్మని కాదనుకుంటే మాత్రం మరో యంగ్ డైరక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం 
ఉందట. మరి ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తేనే కాని డైరక్టర్ ఎవరన్నది చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: