ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన వీరుడు  అతడు. టీమ్ ఇండియా కి రెండు ప్రపంచ కప్ లు  అందించడంలో కీలక పాత్ర పోషించాడు అతడు. ఇటు బ్యాట్  తోనే కాదు అటు బౌలింగ్ తోను  ఎన్నో మ్యాజిక్కులు చేసేవాడు ఆ  యువీరుడు. అయితే క్యాన్సర్ అనే మహమ్మారి చుట్టుముట్టడంతో క్రికెట్ కి దూరమయ్యాడు  టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ . కానీ మహమ్మారి క్యాన్సర్ జయించి మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ బీసీసీఐ ఈ గొప్ప ఆటగాడిని పక్కనపెట్టేసింది. క్యాన్సర్ ను  జయించి 36 ఏళ్ల వయసులోనూ యోయో టెస్ట్ పాస్ అయినప్పటికీ ఏవో సాకులు వెతికి బీసిసిఐ పక్కనపెట్టేసింది. దీంతో మనస్తాపానికి గురైన యువరాజ్ సింగ్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 

 

 

 ఓ  జాతీయ చానెల్ కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన యువరాజ్... తన రిటైర్మెంట్ వెనక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాడు. తనకు జట్టు మేనేజ్మెంట్ నుంచి సరైన మద్దతు రాలేదని యువరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. 2011 ప్రపంచకప్ తర్వాత మరో ప్రపంచ కప్ ఆడలేకపోవడ తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని తెలిపాడు యువరాజు. అయితే తాను యోయో టెస్ట్ పాస్ అయినప్పటికీ బిసిసిఐ మాత్రం తనను  జట్టులోకి తీసుకోలేదని... సరైన సమయంలో తనకి అవకాశాలు వచ్చి ఉంటే క్రికెట్లో ఇంకొన్ని రోజులు పోరాటం చేసే వాడిని అని  తెలిపాడు. 

 

 

 36 ఏళ్ళ వయస్సులో యోయో  టెస్ట్ పాస్ అయినప్పటికీ జట్టులో తనకు స్థానం కల్పించడానికి బిసిసిఐ సాకులు వెతికి.. దేశవాళి క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో తనపై వేటు వేసింది అని ఆరోపించారు. 16 ఏళ్ల పాటు టీమ్ ఇండియా జట్టు సేవలందించిన తనను... బిసిసిఐ ఎందుకు జట్టు నుంచి తొలగించాలని అనుకుంటుందో కూర్చోబెట్టి చెప్పి ఉంటే బాగుండేదని కానీ అలా చేయలేదని యువరాజ్ తెలిపాడు. బిసిసిఐ  పద్ధతి సరైంది కాదని... ఒక్క తన  విషయంలోనే కాదు సెహ్వాగ్,  జహీర్ ఖాన్ లాంటి స్టార్ ఆటగాళ్ల విషయంలోనూ ఇదే విధంగా బిసిసిఐ  వ్యవహరించిందని తెలిపాడు యువరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: