జబర్దస్త్ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ఒక చిన్న కామెడీ షో గా మొదలై బుల్లితెరపై ఒక సెన్సేషన్ సృష్టించింది జబర్దస్త్ షో. ఈశ షో  మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు క్రేజ్  రోజురోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గిన  దాఖలాలు లేవు. అయితే జబర్దస్త్ లో కామెడీ చేసే వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నో కష్టాలు పడి జబర్దస్త్ కు వచ్చిన జబర్దస్త్ నటులు ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కొంతమందికి అయితే హీరోల రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. 

 

 

 

 అయితే జబర్దస్త్ షో మొదలవ్వక క ముందు ప్రస్తుత కమెడియన్స్ అందరూ చాలా కష్టాలు పడి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కొంత మంది సాఫ్ట్వేర్ జాబులు సైతం వదిలేసుకుని రాగా ... కొంతమంది కడు పేదరికం నుంచి వచ్చారు. ప్రస్తుతం హీరోల రేంజ్ లో పాపులార్టీ సంపాదించిన సుడిగాలి సుదీర్... మ్యాజిక్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు. ఇక  ఒక మంచి రైటర్ గా పేరుతెచ్చుకున్న రాంప్రసాద్ జబర్దస్త్ లో  ఆటో పంచ్ లు వేస్తూ ఆటో రాంప్రసాద్ గా ఎంతో ఫేమస్ అయ్యాడు.

 

 

 

 అయితే రాంప్రసాద్ ఒకప్పుడు హోల్ సేల్  మెడికల్ రంగంలో పనిచేసే వాడట. ఇక తన ముక్కు తోనే కామెడీని సృష్టించిన ముక్కు అవినాష్ టీ బాయ్ గా  పనిచేసేవాడట. ఇక అదిరిపోయే స్క్రిప్ట్ ల తో అందరిని నవ్వించే అదిరే అభి లక్షలు శాలరీ ఉన్న సాఫ్ట్ వేర్  ఉద్యోగాన్ని వదిలేసి జబర్దస్త్ లోకి వచ్చాడట. ఇక  ఫ్యామిలీ  స్కిట్ లకు కేరాఫ్ అడ్రస్ అయిన చమ్మక్ చంద్ర... రోజువారి కూలి గా పనిచేసేవారట. తనదైన ఆటిట్యూడ్ తో  స్కిట్ లో  మాయ చేసి అందరిని నవ్వించే చలాకి చంటి జబర్దస్త్ కి  ముందు రేడియో జాకీగా పని చేశాడట. సీక్వెల్స్ స్కిట్ల తో అదిరిపోయే కామెడీ చేసే  రాకెట్ రాఘవ దూరదర్శన్లో స్క్రిప్ట్ రైటర్ గా  పని చేశాడట. ఇక తన చేష్టలతోనే  కామెడీని పండించే  కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ కి ముందు హోటల్లో సర్వర్ గా  పని చేసే వాడట. జబర్దస్త్ కి రాకముందు వరకు ప్రస్తుత కమెడియన్స్ కమెడియన్స్ అందరూ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం వీళ్ళ జీవితాలు మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: