ఏ సినిమా విషయమైనా సక్సెస్ కోసం యూనిట్  అష్టకష్టాలు పడుతుంది. సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. ఇక అక్కడ నుంచి అసలు కధ మొదలవుతుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్లో నిద్ర లేని రాత్రులు చిత్ర యూనిట్ గడుపుతుంది. పాజిటివ్ గా వస్తే ఫరవాలేదు కానీ అదే తేడా వస్తే మాత్రం మరిన్ని నిద్ర లేని రాత్రులు ఎదురుచూస్తాయి. ఈ కధ అందరికీ తెలిసిందే. మరి ఆ చిత్ర యూనిట్ కి సంబంధం లేని ఆ డైరెక్టర్ కి ఎందుకంత టెన్షన్.


ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ఆయన కొరటాల శివ. ఆయన మెగాస్టార్ కోసం ఏడాదికి పైగా కాచుకుని కూర్చున్నాడు. చిరంజీవి సైరా తరువాత కమిట్ అయిన మూవీ ఆయనదే. దాంతో ఆయన సైరా ఫలితం కోసం అందరి కంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నాడు. పాజిటివ్ గా వస్తే ఒక లెక్క ఉంది. నెగిటివ్ గా వస్తే మరో లెక్క ఉంది. ఈ లెక్కల గొడవలతో ఆ కొరటాల బుర్ర వేడెక్కిపోతోందట. చిరంజీవి ఇమీడియట్ గా చేయబోతే సోషల్ మూవీ కావడంతో ఒకవేళ సైరా హిట్ అయితే కొరటాల మూవీ స్పాన్ ని  నేషనల్ లెవెల్ కి పెంచుకోవాలి. బాలీవుడ్లో కూడా రిలీజ్ చేయాలి. సాహో మాదిరిగా బిగ్ కాన్వాస్.   సైరా హిట్ అయితే  ఒక్కసారిగా పాన్ ఇండియా మూవీగా కొరటాల మూవీ మారిపోతుంది.


ఇక స్టోరీలోభారీగా  మార్పులు ఉంటాయి. అలాగే కాస్టింగ్ క్రూ మొత్తం చేంజ్ చేయాల్సివుంటుంది. ఇక సైరా మూవీ హిట్ అయితే బాలీవుడ్ హీరోయిన్ని కొరటాల మూవీలో తీసుకుంటారని కూడా అంటున్నారు. అదే సైరా రిజల్ట్ కొంత తేడా వస్తే మాత్రం కొరటాల మూవీ కొంచెం ఆలస్యం ఆవుతుందని కూడా అంటున్నారు. అదే విధంగా వత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుందని, తప్పనిసరిగా చిరంజీవి మూవీకి బంపర్ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుందని అంటున్నారు. ఇక కధలోనూ ఒకటికి పదిమార్లు చూసుకుని భారీగా మార్పులు చేర్పులతో సినిమా మరింత లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తానికి సైరా అందరి కంటే ఈ డైరెక్టర్లో యమ టెన్షన్ పెడుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: