తమిళ నటుడు కార్తీ -రష్మిక మందన  జంటగా నటిస్తున్న సుల్తాన్  సినిమాకి మనోభావాల సెగ తగిలింది. ఈ నెలలో  మనోభావాలు దెబ్బ తిన్నాయని గోడవ జరగడం ఇది మూడవసారి. వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా కి  మనోభావాల  గోడవ చాలా దూరం వెళ్లింది. సినిమా విడుదలకు ఆరు గంటల ముందు సినిమా పేరును "గద్దలకొండ గణేష్ " గా మార్చడంతో  గోడవ సద్దుమణిగింది . తమిళ నటుడు విజయ్ నటించిన బిగిల్ సినిమాకు మాంసం వ్యాపారుల  రూపంలో షాక్ తగిలింది. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.

వివరాల్లోకి వెళితే   కార్తీ- రష్మిక మందన జంటగా నటిస్తున్న సుల్తాన్   సినిమా షూటింగ్ తమిళనాడు లోని దిండిగల్ ఫోర్ట్ లో జరిగింది.   టిప్పు సుల్తాన్ మహారాజుపై సినిమా తీయడానికి వీల్లేదని  ఆందోళనకారులు పెద్ద ఎత్తున గోడవ చేయడం తో సినిమా యూనిట్ వెనక్కి వచ్చేశారు. 

ఆ తరువాత చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది.  క్రియేటర్స్ గా  సినిమాలో ఏం చూపించాలో నిర్ణయించే హక్కు మాకు ఉంది.ఇది మాకు  ఈ దేశం ఇచ్చిన స్వేచ్ఛ.ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే  విధంగా సంస్థ లేదా వ్యక్తులు  చేసే ప్రయత్నాలను మేము ఖండిస్తున్నాము.సినిమాలో ఏది చూపించకూడదో చెప్పడానికి సెన్సార్ బోర్డు ఉందని  చెప్పారు. అలాగే  కులం పేరిట ,మతం పేరిట మన జాతీయ నాయకులకు మరియు చరిత్రకు అప్రతిష్ట తెచ్చే చర్యలను ఖండిస్తున్నాం అని స్టేట్మెంట్ విడుదల చేసింది. 

సుల్తాన్  సినిమా కి రెమో ఫేం బక్కియరాజ్ కన్నన్  దర్శకత్వం వహిస్తున్నాడు.సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న  ఈ సినిమాకి వివేక్ మరియు మెర్విన్ లు సంగీతం అందిస్తున్నారు..డ్రీమ్ వారీయర్ బ్యానర్ పైన ప్రభు సుల్తాన్  సినిమాను నిర్మిస్తున్నాడు.  సుల్తాన్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: