ఇటీవల శనివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు ఆడుతున్న ఆటలను బయటపెడుతూ జరిగిన వివాదాల గురించి మాట్లాడుతూ అదరగొట్టే యాంకరింగ్ చేశారు నాగార్జున. ఈ క్రమంలో ఇంటి సభ్యుల కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇవ్వటం జరిగింది. శనివారం జరిగిన ఎపిసోడ్ మొత్తం చాలా హాట్ హాట్ గా జరిగింది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగార్జున ఎంట్రీ అవగానే ఇటుకల ఆటలో గాయపడిన వరుణ్ సందేశ్ రాహుల్ లను సీక్రెట్ రూమ్ లో పంపి అక్కడ డాక్టర్ చేత గాయాలను చెక్ చేయించడం జరిగింది. ఈ గొడవ పై ఎవరికి వారు వివరణ ఇవ్వగ చివరాకరికి వరుణ్ సందేశ్ మరియు రాహుల్ ని కలుపుతూ గొడవని సెటిల్ చేశారు నాగార్జున.


కాగా ఈ మధ్యలో వితిక తో నాగార్జున ఈ గొడవ గురించి మాట్లాడగా..ఈ గొడవ జరిగిన తర్వాత తనతో వరుణ్ చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాడని తెలిపింది. అది విన్న నాగ్.. 'అందుకే ఇద్దరి మధ్య గొడవ పెట్టావా?' అంటూ సెటైర్లు వేశారు. ఇదే క్రమంలో బాబా భాస్కర్ గురించి నాగార్జున మాట్లాడుతూ...నీ పేరు బాబా భాస్కర్ గారు బాబా మాస్కర్ అని పేరు పెట్టారు. ఈ క్రమంలో శ్రీముఖి మరి అదేవిధంగా రవి కృష్ణ గురించి ఎలిమినేషన్ ముందు పునర్నవి లతో చర్చించిన వీడియోని ప్లే చేసి బాబా భాస్కర్ బండారం మొత్తం బయట పెట్టారు.


అయితే ఈ సందర్భంగా వివరణ ఇవ్వాల్సిన క్రమంలో బాబా భాస్కర్ నవ్వుతూ కామెడీ చేసి మాట్లాడుతున్న నేపద్యంలో నాగార్జున బాబా భాస్కర్ కి వార్నింగ్ ఇచ్చేటట్టు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా శ్రీముఖి గురించి వరుణ్ రాహుల్ గొడవలు అడ్డంపెట్టుకుని మిత్రభేదం కలిగించకూడదని శ్రీముఖి కి చురకలు అంటిస్తూ కెప్టెన్ అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు నాగార్జున. అయితే చివరాకరికి ఎలిమినేషన్ నుండి జరిగిన చిన్న గేమ్ లో వరుణ్ సందేశ్ సేవ్ అయినట్లు ప్రకటించి శనివారం జరిగిన షో నీ ముగించడం జరిగింది. మొత్తం మీద శనివారం జరిగిన షో లో హోస్ట్ నాగార్జున...ఇంటి సభ్యులందరికీ వార్నింగులు మీద వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: