టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత పేరుంది ఒక్క థమన్ కే. స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ లేదంటే… థమన్ అనే అంటారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కుటుంబ కథా చిత్రాలకు, ప్రేమ కథ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగలదు. ఇక థమన్ మాస్ ఎంటర్‌టైన్మెంట్స్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఇరగదీసాడు. అయితే థమన్ మీద ఒక కంప్లైంట్ ఎప్పుడు తెగ హైలెట్ అవుతుంది. తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల పాటలు బయటికొచ్చిన వెంటనే థమన్ ఆ సినిమా నుండి ఈ ట్యూన్ కాపీ కొట్టాడు. కాదు కాదు ఈ సినిమా నుండి కాపీ కొట్టాడు.. అదేమిటి తన పాటల నుండి తానే కాపీ కొట్టాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే థమన్ ని కాపీ క్యాట్ అంటూ ఆటపట్టిస్తుంటారు. గ‌తంలో థమన్ మ్యూజిక్ అందించిన‌ అరవింద సమేత పాటలను కూడా వేరే వాటితో పోలిక పెట్టేసి థమన్ నువ్విక మారవా అంటూ సోషల్ మీడియా సాక్షిగా ఆడేసుకుంటున్నారు.


అలాగే ప్ర‌స్తుతం అల‌వైకుంఠ‌పురం చిత్రం నుంచి తాజాగా విడుద‌లైన సామజ‌వ‌ర‌గ‌మ‌ణ పాట కాపీ చేయ‌బ‌డింద‌ని తెగ ట్రోల్స్ వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థ‌మ‌న్‌..మ‌రో పాట నుంచి ట్యూన్ కాపీ చేసి కాస్త మార్పులు చేశాడ‌ని సోష‌ల్ మీడియా స‌హా యూట్యూబ్‌లో అనేక వీడియోలు, ట్రోల్ క‌థ‌నాలు క‌న్పిస్తున్నాయి. గ‌తంలోనూ థ‌మ‌న్ పై  ఈ త‌ర‌హా కాపీ ట్రోల్స్ ప‌లు సంద‌ర్భాల్లో వ‌చ్చాయి. 


ఇక బిజినెస్ మ్యాన్ లో ఒక పాటను థమన్ కాపీ కొట్టాడంటే.. అప్పట్లో ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్వయానా నేనే థమన్ కి ఆ సినిమా పాటను వేరే సినిమా మ్యూజిక్ నుండి తీసుకోమని చెప్పానని చెప్పినా… థమన్ మీద ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: