టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల మూవీస్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా చూడొచ్చు అననే భావన ఉంటుంది తెలుగు ప్రేక్షకులకు.  ఇప్పటి వరకు అలాంటి సినిమాలే తీశాడు శేఖర్ కమ్ముల.  ఫ్యామిలీ తరహా సినిమాలు మాత్రమే కాదు సున్నితమైన ప్రేమ కథలు కూడా తెరకెక్కించారు. అలాంటి యూత్ ఫుల్ మూవీనే ‘హ్యాపీడేస్’.  ఈ మూవీతో వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా తర్వాత వరుస సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చారు.  అయితే కొద్ది కాలాం తర్వాత వరుణ్ సందేష్ సినిమాల్లో నటించడం మానివేశారు.

ప్రస్తుతం తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 వరుణ్ సందేశ్, వితిక భార్యభర్తలు ఇంటి సభ్యులుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం వీరి జర్నీ ఎనిమిదవ వారం సాగుతుంది. ఇక హ్యాపీడేస్ తో పరిచయం అయిన మరో హీరో నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ నటించిన ఒకటీ రెండు సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ కాలేదు.  కలర్స్ స్వాతి నటించిన స్వామిరారా మూవీ నిఖిల్ కి బాగా కలిసి వచ్చింది.  ఆ వెంటనే స్వాతితో నటించిన ‘కార్తికేయ’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఇక సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ,కేశవ ఇలా వరుస విజయాలు సాధించాడు.  జర్నలిస్ట్ బ్యాగ్ డ్రాప్ లో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..ఆ మూవీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది. 

కిర్రాక్ పార్టీ దారుణంగా ప్లాప్ అవ్వడంతపో ఈ రీమేక్ తో అయినా హిట్టందుకోవాలని కష్టపడుతుంటే మొదట ముద్ర అని టైటిల్ ఫిక్స్ చేసుకోగా అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నిఖిల్ తన సినిమా పూర్తి చేసినప్పటికీ అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ప్రీ ప్రొడక్షన్ తరువాత అలాగే ఉండిపోయింది.  అయితే రిలీజ్ కాకుండానే మిగిలిపోతుంది అనుకున్న అర్జున్ సురవరం సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తేవడానికి ఈ యువ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నట్లు నిఖిల్ అధికారికంగా తెలియజేశాడు.టిసంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీకి కూడా గత కొంత కాలంగా హిట్స్ లేవు.సో.. లావణ్య కెరీర్ కు కూడా అర్జున్ సురవరం చాలా ఇంపార్టెంట్.


మరింత సమాచారం తెలుసుకోండి: