మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు. ఆయన మెత్తని మనిషి. పగలు, ప్రతీకారాలు అన్నీ సినిమాల్లోనే తప్ప నిజజీవితంలో ఆయన ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనరు. అది ఆయనకు ఉన్న గొప్ప గుణం. అటువంటిది మెగాస్టార్ పగను తీర్చుకోవడం ఏంటి అన్న డౌట్ అందరికీ  వస్తుంది. అయితే మెగా పగ వేరుగా ఉంటుంది. అది మామూలు పగ కాదు, దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేంటో చూద్దాం...


చిరంజీవి ఓటమిని ఒప్పుకునే రకం కాదు. ముఖ్యంగా తనకు పాషన్ అయిన సినిమా రంగంలో ఆయన ఎపుడూ ఓడిపోలేదు. గెలుపు తీరాలకు అలా సాగుతూ ముందుకే వెళ్ళారు. అయితే అపుడపుడు చిరంజీవిని కొన్ని ఫ్లాప్స్ పలకరించినా అవి కూడా ఆయనకు బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు దారి చూపాయి. ఇలా వచ్చిన ఫ్లాప్స్ దిష్టి తీసిపెట్టాయి. ఇదిలా ఉంటే చిరంజీవి నిజానికి హిట్లు ఫ్లాప్స్ కి అతీతుడుగా మారి చాలా కాలమే అయింది.


అయితే ఆయనకు బాలీవుడ్లో జెండా ఎగరేయాలన్న  కసి, కోరికా దశాబ్దాలుగా ఉంది. ఆయన రెండు హిందీ సినిమాలు డైరెక్ట్ గా చేశారు. కానీ అవి మంచి రిజల్ట్ ని ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో సైరా ప్యాన్ ఇండియా మూవీగా వస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక హిట్ అయితే చిరు బాలీవుడ్ కోరిక తీరిపోతుంది. అలాగే ఆయనలో దాగున్న పగ, ప్రతీకారం కూడా ఈ స్వీట్ రివెంజ్ తో తీరిపోతాయి.


చిరంజీవి ఇపుడు అదే నమ్మకంతో ఉన్నారు. చిరు స్టామినా ఏంటో టాలీవుడ్ ఎపుడో చూసేసింది. ఇక మిగిలింది బాలీవుడ్. అక్కడ తన సత్తా చాటాలని మెగాస్టార్ ఎప్పటి నుంచో వువ్విళ్ళూరుతున్నారు. ఆ ముచ్చట సైరా మూవీ ఆయనకు తీరుస్తుందని అంటున్నారు. సైరా మూవీ కనుక హిట్ అయితే మెగాస్టార్ ఆనందానికి అవధులు ఉండవని అంటున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజమైన  బాలీవుడ్ లో జెండా పాతేయాలన్న కల ఆయనకు ఈ విధంగా తీరడమే అసలైన విజయం అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: