రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్ లో మంచి డీసెంట్ హిట్స్ అందుకుంటున్నాడు. ఒక జోనర్ లోనే సినిమాలు చేస్తు ఒకేరకమైన ఇమేజ్ అనే చట్రం లో ఇరుక్కుపోకుండా, మాస్ హీరోగా ఒక ఇమేజ్ కోసం పాకులాడకుండా ఉన్న హీరో రాజ్ కుమార్. అన్నీ డిఫ్రెంట్ సినిమాలతో తనకంటు ఒక మార్కెట్ ను సంపాదించుకొని బాలీవుడ్ హీరోగా ఫేమస్ అయ్యాడు. ఇక రాజ్ కుమార్ రావ్- మౌనీ రాయ్ జంటగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ సినిమా మేడిన్ చైనా. మిఖిల్ ముసాలే ఈ సినిమాకి దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు. అక్టోబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు హౌస్ ఫుల్ 4.. సాంద్ కీ ఆంఖ్ అనే భారీ బడ్జెట్ సినిమాలతో పోటీపడి రిలీజవుతుండడంతో పోటీ గట్టిగానే ఉండబోతోంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో పాటను రివీల్ చేస్తూ టీమ్ ప్రచారం పరంగా ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపుతోంది. ఇదివరకూ ఈ సినిమాలోని మొదటి పాట రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో పాటను కూడా  రిలీజ్ చేశారు. 'సనేడో సనేడో' అంటూ సాగే పాటను చిత్ర బృందం రిలీజ్ చేశారు. నవరాత్రి స్పెషల్ సాంగ్ గా రిలీజ్ చేశారు. సత్యం జిగర్ సంగీతం అందించగా.. నిరన్ భట్ - జిగర్ సరయ్య లిరిక్స్ అందించారు. ఈ పాటను మికా సింగ్ తో కలిసి బెన్నీ దయాల్- నికిత గాంధీ పాడారు. సినిమా కథ.. ఒక బిజినెస్ మేన్ జర్నీకి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఒక గుజరాతీ మధ్యతరగతి వ్యాపారి జీవన ప్రయాణంలో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అన్నది తెరపై చూపించబోతున్నారు.

తాజాగా రిలీజైన పాటలో మౌనీ రాయ్ బాట్ నెస్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. బెడ్ రూమ్ లో భర్తతో మౌనీ రొమాన్స్ పీక్స్ లో ఉండటం విశేషం. రాజ్ కుమార్ రావ్ రొమాంటిక్ హీరోగా అద్భుతమైన ఫన్ తో ఆకట్టుకుంటున్నాడు. అతడి నుంచి మరో మాస్టర్ క్లాస్ సినిమా వస్తోందని ఫిక్సైపోవచ్చు. అయితే అదే రోజు పునర్జన్మల కన్ఫ్యూజన్ కామెడీ నేపథ్యంలో వస్తున్న హౌస్ ఫుల్ 4 ప్రభావం ఈ సినిమాపై ఏ మేరకు పడుతుంది? అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: