మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా చరిత్ర సృష్టించింది 'సైరా'. అయితే ఈ క్రమంలో తండ్రి చిరంజీవి సినిమా కోసం అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించిన నిర్మాత రామ్ చరణ్ పై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరియు అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సైరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చోట్ల ఈ సినిమాని నిర్మించిన తన కొడుకు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ..రామ్ చరణ్ నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందని తన జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం రామ్ చరణ్ నా కొడుకుగా పుట్టడం అంటూ చాలా గర్వంగా చిరంజీవి తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ మాత్రం సరికొత్త అధ్యాయానికి ఇండస్ట్రీలో తరలిపోయారు.


ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిర్మాతలు కొడుకులను హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే వాళ్లకు భిన్నంగా రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి కలను నెరవేర్చడం కోసం నిర్మాతగా మారి ఇటువంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయినా సైరా సినిమా నిర్మించడం నిజంగా గ్రేట్ అంటూ ఇటువంటి ఛాన్స్ దక్కించుకున్న వ్యక్తిగా రామ్ చరణ్ ఒకరు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారు అంటూ చాలా మంచి ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.


మరియు అదే విధంగా సైరా సినిమా యూనిట్ వారు కూడా సినిమా రిలీజ్ తర్వాత 'సైరా' సినిమా నిర్మాణ విలువలు గురించి అందరు మాట్లాడుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. ప్రస్తుతం సినిమా మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సైరా టీం. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడటానికి అన్ని అనుమతులు తీసుకున్న 'సైరా' టీం ఎలాగైనా ఓపెనింగ్స్ అదరగొట్టే రీతిలో ఉండటానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న సైరా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: