మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి గాంధీ జయంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు పాజిటివ్ టాక్ వినపడుతుండడంతో, సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని అంటున్నారు సినిమా యూనిట్. ఇక మెగా ఫ్యాన్స్ కూడా సినిమాపై ఎంతో నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. తొలి సారి మెగాస్టార్ చిరంజీవి ఒక స్వతంత్ర సమరయోధుడు పాత్రలో నటిస్తూ ఉండడం, అలానే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాత కావడం, మరీ ముఖ్యంగా పాన్ ఇండియా అపీల్ తో వస్తున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో రూ.250 కోట్ల పైనే ఖర్చు చేసి ఉండడంతో, 

సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరిలోన నమ్మకం ఏర్పడింది. అయితే సైరా టాక్ విషయం అటుంచితే, ఈ సినిమాకు థియేటర్ల విషయమై మాత్రం చాలావరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలకు దాదాపుగా 6000 నుండి 7000 వరకు థియేటర్స్ లభించాయని, ఇక ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో అయితే ఏకంగా 9000 థియేటర్స్ లో రిలీజ్ అయిందని అంటున్నారు. అయితే నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుడి ముందుకు వస్తున్న సైరాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలుపుకుని కేవలం 3600 మేర మాత్రమే థియేటర్లు దక్కాయని అంటున్నారు. అయితే ఇందుకు ఒక కారణం కూడా ఉందట, అదే రోజున హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న హృతిక్ రోషన్, 

టైగర్ ష్రాఫ్ ల వార్ సినిమా కూడా ఉండడంతో సైరాకు థియేటర్స్ విషయంలో కొంత దెబ్బ పడిందని చెప్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ వర్గాలు సాహో సినిమాకు ఇచ్చిన హైప్,  సైరాకు ఇవ్వడం లేదని, అలానే అక్కడ ఎక్కువగా అందరూ వార్ సినిమా పైనే ఫోకస్ చేస్తూ మాట్లాడడం సరైనది కాదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు థియేటర్స్ విషయంలో అలానే బాలీవుడ్ క్రేజ్ విషయంలో బాహుబలి, సాహో సినిమాలను సైరా అనుకోలేకపోయిందని చెప్తున్నారు. అయితే సైరా టాక్ కనుక బాగుంటే మాత్రం, ఓవర్ అల్ గా సూపర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం కూడా లేకపోలేదని, మొత్తంగా రేపు రిలీజ్ తరువాత వచ్చే టాక్ ని బట్టి కానీ సైరా సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందనేది చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: