రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన చిత్రం రాయలసీమ లవ్ స్టొరీ. సినిమా విడుదలకు ముందు టైటిల్ పట్ల వివాదం చెలరేగింది , అయినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి విడుద‌లైన ఈ చిత్రం బీసీ సెంట‌ర్స్‌లో దుమ్మురేపుతుంది.


యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన రాయలసీమ లవ్ స్టొరీ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది యువత నుండి. సెప్టెంబర్ 27 న విడుదలైన రాయలసీమ లవ్ స్టొరీ చిత్రాన్ని బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతకు కావాల్సిన మసాలా పుష్కలంగా ఉన్న ఈ చిత్రానికి రామ్ రణధీర్ దర్శకత్వం వహించగా పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


వెంకట్ , హృశాలి , పావని హీరో హీరోయిన్ లుగా నటించగా వెంకట్ - హృశాలి ల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు యువతను విశేషంగా అలరిస్తున్నాయి. తెలంగాణ , రాయలసీమ , ఆంధ్రా అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని బిసి కేంద్రాల్లో ఆదరణ లభిస్తుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు పంచలింగాల బ్రదర్స్ , రామ్ రణధీర్ లు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా పాటలు కూడా రాయలసీమ లవ్ స్టొరీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.


పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. తక్కువ బడ్జెట్ లోనే చేసినప్పటికీ క్వాలిటీ పరంగా రాజీపడలేదు. ఇక దర్శకుడు రామ్ రణధీర్ విషయానికి వస్తే ..... అతడికి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ యూత్ ని అలరించే అన్ని అంశాలతో రాయలసీమ లవ్ స్టొరీ చిత్రాన్ని రూపొందించాడు. యూత్ కి సందేశం ఇస్తూనే వాళ్లకు కావాల్సిన మసాలా ని అందించాడు. డైలాగ్స్ కూడా యూత్ కి విపరీతంగా నచ్చడం ఖాయం. కాస్త పరిధి దాటి డైలాగ్స్ ని రాసినప్పటికి అవి యువతిని మెచ్చేలా ఉన్నాయి. దర్శకుడిగా కొత్త అయినప్పటికీ తనకు కావాల్సిన నటనని నటీనటుల నుండి రాబట్టుకున్నాడు. 4 పాటలు యువతని విశేషంగా అలరించేలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: