అభిమానులు,సినీప్రియులు అంతా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది.అదేనండి,బుధవారం విడుదలవుతున్న మచ్ వెయిటెడ్ మెగాస్టార్‌ మూవీ సైరా..చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం బుధవారం విడుదలకానున్న నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది.దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘సైరా నరసింహారెడ్డి’ తొలి రోజు దక్షిణాదిలో రూ. 30 కోట్లు రాబట్టే అవకాశముందని కొందరి సినిపండితులు అంచనా వేస్తున్నారు..



ఇక ఇదే అంచనాలతో సాహో ఎంత హంగామా చేసిందో అందరికి తెలిసిందే.భారీ తారగణం,భారీ బడ్జెట్,అధికశ్రమ,ఇవన్ని కూడా సాహోను గట్టెక్కించలేకపోయాయి.ఇక సాహొ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా..బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.400 కోట్లను రాబట్టి..కాని బహుబలితో తెచ్చుకున్న పేరు కాస్తా ఈ సినిమాతో మసక బారిందనిపిస్తుంది. ఇక ఖైదీ నం 150 తర్వాత చిరు చేస్తున్న సినిమా కాబట్టి సైరా పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.అందులో చిరంజీవి అంటే ఇప్పటికి ప్రేక్షకుల్లో వున్న అభిమానం ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లుందని ఆశ..



ఇక సైరా సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఎన్నో అవాంతరాలుదాటుకుంటు ఇక్కడి దాక వచ్చింది.మాములూగా సగటు ప్రేక్షకుడు చిరంజీవి నుండి అదరగొట్టే డ్యాన్స్, కుమ్మేసే ఫైట్స్ ఆశిస్తాడు.ముందే చిరంజీవి ఎన్నో ఊహించుకుని సినిమాకు వెళ్లుతాడు అవేవి అక్కడ కనబడకపోతే నిరాశతో ఉంటాడు.ఇక ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే,సాహో దాన్ని కొనసాగించింది.'బాహుబలి'వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఓ నటుడుగా ప్రభాస్ పైనా,ఆయన్ని డీల్ చేసే దర్శకుడుపైనా ఎక్కడలేని అంచనాలను పెంచేసుకుంది..



ఇప్పుడు అదేకోవాలో వస్తుందనుకున్న సైరా నిరాశ పరిచేలా వుందని కొందరు పెదవి విరుస్తున్నారట? ఇక ఇన్ని కోట్లుపెట్టి తీసే సినిమాల్లో కంటెంట్ ఎంతవరకు వుంది.ఇది ఏమేరకు ప్రేక్షకుల్ని చేరుకుంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగేస్తే మంచిందంటున్నారు.లేకుంటే అన్నేసికోట్లు,అంతంత స్టార్ ఇమెజ్‌లు కూడా చివరికి గుర్తింపు లేకుండా కనుమరుగై అపహస్యం పాలు చేస్తాయి.అని అనుకుంటున్నారట?


మరింత సమాచారం తెలుసుకోండి: