చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్.. మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ కూడా వస్తుంది.


అంతేకాదు సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. సినిమా తమిళ, హింది, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ క్రేజ్ ఉన్న హీరోలను సినిమాలో భాగం చేశారు. అయితే ఇప్పుడు అదే ప్రేక్షకులను నొప్పించేలా చేస్తుంది. సైరాలో చేసిన పర భాషా హీరోల ఫ్యాన్స్ సినిమా చూసి హర్ట్ అవుతున్నారు.   


సుదీప్ పాత్ర కొద్దిగా బెటర్ గా ఉన్నా.. విజయ్ సేతుపతి కేవలం రెండు మూడు సీన్స్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక జగపతి బాబుని కూడా సరిగా వాడుకోలేదని వార్తలు వస్తున్నాయి. నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నటించిన అమితాబ్ బచ్చన్ పాత్ర వరకు బాగానే చూపించారు. అమితాబ్ తెలుగులో నటించిన మొదటి సినిమా అవడం విశేషం. మనం సినిమాలో చిన్న పాత్ర మాత్రమే చేసిన అమితాబ్ సైరాకు సపోర్ట్ గా నిలిచారు.  


ఇక సినిమాలో హీరోయిన్స్ గా నటించిన నయనతార కొన్ని సీన్స్ కే పరిమితమైంది. తమన్నాకు మంచి పాత్ర పడ్డదని చెప్పొచ్చు. సో ఇలా కాస్టింగ్ విషయంలో భారీగా వెళ్లినా సరే వారికి తగిన ప్రాధాన్యత లేదన్నది కొందరి మాట. ఆ హీరోల ఫ్యాన్స్ సైరా విషయంలో కొద్దిగా అప్సెట్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఇవి కలక్షన్స్ ఇంకా సినిమా రిజల్ట్ మీద ఏమాత్రం ప్రభావితం చేస్తాయో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: