ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక నార్మల్ షో గా  మొదలై నెంబర్వన్ కామెడీ షో గా ఎదిగింది జబర్దస్త్. ఇక జబర్దస్త్ చూస్తుంటే వాళ్ళు వేసే పంచులకి  పొట్టచెక్కలే అవ్వాల్సిందే. అందుకే జబర్దస్త్ షో వస్తుందంటే అందరూ టీవీలకు అతుక్కుపోతారు. కాగా  జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది కమెడియన్స్ చాలా పాపులారిటీ ని సొంతం చేసుకున్నారు. ఇలా పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో కొంతమంది లేడీ గెటప్ వేసి చాలా గుర్తింపు పొందారు.

 

 

 

 వాళ్లులో  ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు వినోదిని( వినోద్)... జబర్దస్త్ లో  లేడీ గెటప్ లు వేయాలంటే అది ఒక్క వినోదిని కే సాధ్యం. అమ్మాయిలకి మించిన అందం అంతకుమించిన  పర్ఫామెన్స్. ఇక వినోద్  లేడీ గెటప్ వేస్తే వినోద్ ముందు మహా అందగత్తెలు  కూడా పని చేయలేరు . అయితే చాలా రోజుల నుంచి వినోద్ జబర్దస్త్ షో లో కనిపించడం లేదు. అయితే దీనికి కారణం మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ కి మద్దతుగా వైసీపీ తరఫున ప్రచారం లో పాల్గొనటమే అనే  వార్త వినిపిస్తోంది. ఈ కారణంగానే వినోద్ ను జబర్దస్త్ నుంచి పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై వినోద్ స్పందించాడు. జగన్ తరుపున ప్రచారం చేయటం వళ్ల  తనను జబర్దస్త్ నుంచి పక్కన పెట్టారని వస్తున్న వార్తలు నిజం కాదని... తనను ఎవరూ జబర్దస్త్ నుంచి పక్కన పెట్టలేదని... బిజీగా ఉండడంతో జబర్దస్త్ కి డేట్స్ ఇవ్వలేక పోయాను అని వినోద్ తెలిపారు. కాగా ఆ తర్వాత తనపై జరిగిన దాడిలో గాయపడి  కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని అందువల్ల జబర్దస్త్ కి రావడం లేదని వినోద్ తెలిపాడు.  కాగా త్వరలో జబర్దస్త్ కి మళ్లీ రాబోతున్నానని  అని చెప్పుకొచ్చాడు వినోద్ .

మరింత సమాచారం తెలుసుకోండి: