Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 5:03 pm IST

Menu &Sections

Search

ఇండియా పాకిస్థాన్ కోణంలో చాణ‌క్య చిత్రం లేదు - తిరు

ఇండియా పాకిస్థాన్ కోణంలో చాణ‌క్య చిత్రం లేదు - తిరు
ఇండియా పాకిస్థాన్ కోణంలో చాణ‌క్య చిత్రం లేదు - తిరు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య  విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు తిరు తెరకెక్కించిన చాణక్య మూవీ ఏ కె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా మెహ్రీన్ ఫిర్జా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు....


ఈ చిత్రం ఎలా మొద‌ల‌యింది?
గోపీచంద్ తో దర్శకుడు శివ శౌర్యం చిత్రం చేసిన‌ప్పటి నుండే నాకు పరిచయం ఉంది. శివ నేను ఒక తమిళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన అనుభందం ఉంది. శౌర్య చిత్రం సినిమా షూటింగ్ టైం లోనే గోపీచంద్ తో ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాను. కొద్దిరోజుల క్రితం చాణక్య మూవీ స్క్రిప్ట్ వినిపించగా ఆయనకు నచ్చడంతో ఈ మూవీ సెట్స్ పైకెళ్లింది.


త‌మిళ్ డైరెక్ట‌ర్ క‌దా తెలుగులో తియ్య‌డం ఎలా అనిపించింది?
మాది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లోని ఓ గ్రామం. మాకు చిత్తూర్ కేవలం 29కిలోమీటర్ల దూరంలో ఉండేది. దీనితో చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలు చాలా చూడటం జరిగింది. చిరంజీవిగారంటే చాలా అభిమానం ఆయ‌న సినిమా ఏదీ కూడా వ‌ద‌ల‌కుండా చూసేవాడ్ని ఇప్ప‌టికీ చూస్తూనే ఉన్నాను.


స్పై చిత్రాల కోసం మీరు చేసిన రీసెర్చ్ ఏంటి?
స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైనటువంటి ఐ ఎస్ ఐ, సి ఐ ఏ, రా వంటి వాటి గురించి బాగా చదివాను. అసలు స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు, వారి బాడీ లాంగ్వేజ్, రోల్స్ ఇలా చాలా విషయాలపై రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ‌ను క‌లిసిన‌ప్పుడు కొన్ని కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. అలాగే ఎన్నో స్పై చిత్రాలు చూశాను. గూఢాచారి లాంటి స్పై చిత్రాలు ఎన్నో చూశాను. వాట‌న్నిటి ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది.


ఈ చిత్రం చేయడానికి మీకు వాస్తవ జీవితంలో ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా?
ఉన్నారండీ.., రవీంద్ర అనే ఒక స్పై ఉన్నారు. ఆయన బ్లాక్ టైగర్ అని బాగా ప్రసిద్ధి. ఆయన కూడా నా మూవీకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అందుకే చాణక్య చిత్రంలో ఒక స్పై పాత్రకు రవీంద్ర అని పేరు పెట్టడం జరిగింది.


చాణక్య మూవీ అసలు దేని గురించి ?
చాణక్య మూవీ ఒక స్పై చేపట్టే ఆపరేషన్ గురించి. ఆ ఆపరేషన్ ఏమిటి? అతను చేధించాల్సిన లక్ష్యం ఏమిటీ? అనేది మీరు వెండి తెరపై చూడండి. వాస్తవికతకు దగ్గరగా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా చాణక్య మూవీ తెరకెక్కించాను. ఒక రా ఏజెంట్ చూసినా..,సంతృప్తి పడేలా చిత్రం ఉంటుంది.


పాకిస్టాన్‌ని నెగిటివ్‌గా చూపించారా?
అలా అని కాదండి, నేను ఈ చిత్ర కథను పాకిస్థాన్ ఇండియా కోణంలో రాయలేదు, చూపించలేదు. నా మూవీలో విలన్ పాకిస్తాన్ లో ఉంటాడు అంతే కానీ, పాకిస్థాన్ చెడ్డది అన్నట్లు కాదు. ఇక్కడ మంచి చెడు అనేకోణంలో చెప్పాం కానీ, ఇండియా పాకిస్తాన్ కోణంలో కాదు. నాకు చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు, ఈ చిత్ర స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు వారందరి మనోభావాలు నేను మనసులో పెట్టుకున్నాను.


చాణక్య మూవీ హాలీవుడ్ మూవీకి ఇన్స్పిరేషన్ అని అంటున్నారు?
నాట్ ఎట్ ఆల్ అండీ..,నిజానికి ఈ విషయంపై నేనే స్పష్టత ఇద్దాం అని అనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ చిత్రంతో కూడా ఈ మూవీని పోల్చుతున్నారు. నిజానికి ఇది కంప్లీట్ గా కొత్త కథ, సినిమా చూశాక మీకే ఆ విషయం అర్థం అవుతుంది.


ఈ చిత్ర షూటింగ్ సమయంలో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యారు, కారణం?
అది షూటింగ్ 28వ రోజు అలాగే చివరి రోజు, ఒక ఫైట్ సన్నివేశం షూట్ చేస్తున్నాం. స్టార్ చేసి ఉన్న బైక్ కారణంగా ఆయనకు పెద్ద గాయమే అయ్యింది. నేను షాక్ లో ఉన్నాను, కానీ గోపీచంద్ చాలా నిబ్బరంగా కారు తీసుకురండి హాస్పిటల్ కి వెళదాం అని చెప్పారు. మారు మూల గ్రామంలో ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేశాక, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ కి తీసుకెళ్లడం జరిగింది. అంత పెద్ద గాయంలో కూడా ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు.


మూవీ విజయం పై కాన్ఫిడెంట్ గా ఉన్నారా?
ఖచ్చితంగా …, ఈ మూవీ స్క్రిప్ట్ పై ఐదేళ్లు పని చేయడం జరిగింది. నిర్మాతలు , నేను మూవీ విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం.


మీ నెక్స్‌ట్ ప్రాజక్ట్స్‌?
నిజంగా చెప్పాలంటే..,తెలుగు మరియు తమిళ భాషలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతం నా ధ్యాసంతా చాణక్య చిత్రం పైనే. ఈ మూవీ విడుదల అయ్యాక వాటి గురించి ఆలోచిద్దాం అని నిర్ణయించుకున్నాను.


india pakistan konamlo chanakya chitram ledu - tiru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొనసాగుతున్న టీఎస్ఆర్టీసీ సమ్మె.. ఇక్కట్ల‌లో ప్రజలు
జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇవి తినాల్సిందే...!
రాత్రిపూట మ‌నం చేసే త‌ప్పులే మ‌న‌కు శాపాలా...?
రెండు రెట్లు ఎక్కువ చూపిస్తానంటున్న మారుతి
కాంబినేషన్ కొత్తగా ఉందంటున్న మ‌హేష్‌
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?
హాలీవుడ్ స్ధాయికి రౌడీ హీరో క్రేజ్‌.... జోష్‌ మాములుగా లేదుగా...!
క్రేజీ హీరోకి సూప‌ర్‌స్టార్ స‌పోర్ట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో...?
త‌మ్ముడు స‌క్సెస్ అయితే నేను డ్ర‌స్ మారుస్తా...?
ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న మంజు
వ‌ర్మ `బ్యూటిఫుల్‌` ఘాటు మాములుగాలేదుగా...?
ఉత్తేజ్ స్కూల్‌కి డిమాండ్ బాగానే ఉందే...?
సాయి పల్లవి 'అనుకోని అతిథి'
హీరో వెంక‌టేష్ నాకు ఇన్స్‌పిరేష‌న్‌
డైరెక్ట‌ర్లను అంత మాట అనేశాడేంటి
వి.వి. వినాయ‌క్ కి చోటాకె.నాయుడంటే భ‌య‌మా...?
రాజ‌మౌళి ఈగ తో పోటీ ప‌డుతున్న చీమ
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.