బుల్లితెరపై జబర్దస్త్ షో సృష్టిస్తున్న సంచనాలు అందరికీ తెలిసిందే. ఒక చిన్న కామెడీ షోగా  మొదలైన జబర్దస్త్ బుల్లితెర చరిత్రలోనే ఒక నెంబర్ వన్ కామెడీ షో గా ఎదిగింది. అయితే జబర్దస్త్ తర్వాత ఎన్నో కామెడీ షో లు తెరమీదికి వచ్చినప్పటికీ... జబర్దస్త్ నవ్వుల సునామీలో కొట్టుకుపోయాయి. ఇక ప్రతి గురు శుక్రవారం జబర్దస్త్ లో కమెడియన్స్ వేసే పంచులు మరో వారం జబర్దస్త్ వచ్చేవరకు నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. ఇక గురు శుక్రవారం వచ్చింది అంటే అందరూ టీవీలకు అతుక్కు పోవాల్సిందే. 

 

 

 

 

 అయితే జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఒకరు  సుడిగాలి సుదీర్ . అయితే సుడిగాలి సుదీర్ అంతలా ఫేమస్ అవ్వడానికి కారణం కూడా లేకపోలేదు లెండి. జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ కెమిస్ట్రీ అందరినీ ఆకర్షిస్తుంది. జబర్దస్త్ లో వీరి  కెమిస్ట్రీ చూసి  సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో  సుడిగాలి సుధీర్ రష్మి కెమిస్ట్రీ  అందరిని ఆకర్షిస్తుంటుంది . ఇటు జబర్దస్త్ లో కూడా మరో ఇద్దరి కెమిస్ట్రీ ఈ మధ్య తెర మీదికి వస్తుంది. తన పంచుల సునామీతో  ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హైపర్ ఆది... ఈమధ్య యాంకర్ అనసూయ తో డాన్స్ చేయడం స్కిట్ లో డైలాగులు చెప్పించడం లాంటివి చేస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అందరినీ బాగానే ఆకర్షిస్తోంది. 

 

 

 

 అయితే జబర్దస్త్ హైపర్ ఆది టీం లో ని రైజింగ్ రాజు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ఆది అనసూయ కెమిస్ట్రీ పై మాట్లాడారు. స్కిట్ లో ఏదైనా చిన్న బీట్ జనాల్లోకి బాగా వెళ్తే... డైరెక్టర్లు ఎక్కువగా అలాంటి స్కిట్లు రాస్తారని రైసింగ్ రాజు  తెలిపారు . ఈ కోవలోనిదే ఆది-అనసూయ కెమిస్ట్రీ అని చెప్పిన రైసింగ్ రాజు... జబర్దస్త్ టీమ్ అంతా ఒక కుటుంబం అని అనసూయని తన సోదరిగా కూతురిగా భావిస్తానని తెలిపారు . జనాల్లోకి వెళ్తుందని స్కిట్లు అలా రాస్తారు తప్ప... తమ మధ్య సోదరభావం ఉంటుందని రైసింగ్ రాజు తెలిపారు. అనసూయ తనను బాబాయ్ అనిపిస్తుందని ఈ సందర్భంగా రైసింగ్ రాజు తెలిపారు. స్కిట్  లో భాగంగా అందరూ అలా నటిస్తారు  తప్ప బయట మాత్రం అనసూయని చెల్లి అక్క గా భావిస్తారని రైసింగ్ రాజు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: